కేజీఎఫ్‌ మేకర్స్‌ ద్విత్వ

‘కేజీఎఫ్‌’ లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన దక్షిణాది చిత్రనిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ కొత్త చిత్రాన్ని ప్రకటించింది. కన్నడ హీరో పునీత్‌రాజ్‌కుమార్‌తో ‘ద్విత్వ’ అనే భారీ బడ్జెట్‌ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘యు టుర్న్‌’ ఫేమ్‌ పవన్‌ కుమార్‌ దర్శకుడు. విజయ్‌ కిరగందూర్‌ నిర్మాత. పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్‌ 21 నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది.హోంబలే ఫిల్మ్స్‌ ప్రస్తుతం ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’ చిత్రం నిర్మిస్తోంది.  


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.