KGF 2: సర్‌ప్రైజింగ్ అప్‌డేట్

ABN , First Publish Date - 2022-08-12T19:54:38+05:30 IST

కన్నడ రాకింగ్ స్టార్ యాష్ (Yash) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన కేజీఎఫ్ 2 (KGF 2) ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయడానికి డేట్ కన్‌ఫర్మ్ అయింది.

KGF 2: సర్‌ప్రైజింగ్ అప్‌డేట్

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన కేజీఎఫ్ 2 (KGF 2) ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయడానికి డేట్ కన్‌ఫర్మ్ అయింది. కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్‌లను మరో రేంజ్‌కి తీసుకెళ్ళింది. అందరూ అనుకున్నట్టుగానే సీక్వెల్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా.. రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.


ఈ ఏడాది ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటి వరకు ఈ ఏడాది వచ్చిన వాటిలో ఆర్ఆర్ఆర్ తర్వాత ఊహించని వసూళ్ళు సాధించిన సినిమాలలో కేజీఎఫ్ 2 మాత్రమే నిలిచింది. ఇక ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కూడా సత్తా చాటేందుకు సిద్ధం అయింది. సంచలన దర్శకుడు రాం గోపాల్ సహా బాలీవుడ్ మేకర్స్ కేజీఎఫ్ 2 మూవీని చూసి ప్రశంసించారు.


తెలుగులో ప్రముఖ ఛానల్ జీ తెలుగు వారు ఈ మూవీ శాటిలైట్ హక్కులు సొంతం చేసుకోగా, ఇప్పుడు ఈ మూవీ టెలికాస్ట్ డేట్ ని అనౌన్స్ చేసేశారు. ఈ సినిమాను ఆగస్ట్ 21న సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక మాసివ్ అనౌన్సమెంట్ పోస్టర్‌ని వదిలారు. థియేటర్స్‌లో భారీ సక్సెస్ సాధించిన ఈ సినిమా స్మాల్ స్క్రీన్ మీద ఎలాంటి టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేస్తుందో చూడాలి. 



Updated Date - 2022-08-12T19:54:38+05:30 IST