'KGF 2': డబ్బింగ్ పూర్తి చేసిన సంజయ్ దత్..రిలీజ్ డేట్ ఫిక్స్

ABN , First Publish Date - 2021-12-07T18:25:40+05:30 IST

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా రూపొందుతున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ సీక్వెల్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్‌ను సంజయ్ దత్ పూర్తి చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో

'KGF 2': డబ్బింగ్ పూర్తి చేసిన సంజయ్ దత్..రిలీజ్ డేట్ ఫిక్స్

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా రూపొందుతున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ సీక్వెల్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్‌ను సంజయ్ దత్ పూర్తి చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే పతాకంపై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి చేసుకుంది. ఈ సినిమా విడుదల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ రవీనా టాండన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సంజయ్ ఇందులో పోషిస్తున్న అధీరా పాత్ర చాలా హైలెట్‌గా నిలుస్తుందని ఇప్పటికే విడుదలైన ఆయన పోస్టర్ అలాగే టీజర్‌తో అర్థమైంది. కాగా, సంజయ్ దత్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేసినట్టు తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2022 ఏప్రిల్ 14న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగానూ ప్రకటించారు.  

Updated Date - 2021-12-07T18:25:40+05:30 IST