'KGF 2': జనవరి 8న ఫ్యాన్స్‌కు నిరాశేనా..?

ABN , First Publish Date - 2022-01-06T16:14:54+05:30 IST

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కన్నడ రాకింగ్ స్టార్ యష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కేజీఎఫ్ ఛాప్టర్ 2'. ఈ సినిమా నుంచి జనవరి 8న సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఏదైనా వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'KGF 2': జనవరి 8న ఫ్యాన్స్‌కు నిరాశేనా..?

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కన్నడ రాకింగ్ స్టార్ యష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కేజీఎఫ్ ఛాప్టర్ 2'. ఈ సినిమా నుంచి జనవరి 8న సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఏదైనా వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, అది ఇండకపోవచ్చుననే టాక్ వినిపిస్తోంది. 'కేజీఎఫ్ 1'కి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేశ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 


అయితే, జనవరి 8న హీరో యష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా గత ఏడాది ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా, సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అదే విధంగా ఈసారి కూడా యష్ బర్త్ డే కానుకగా 'కేజీఎఫ్ 2' నుంచి టీజర్ వస్తుందని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆశిస్తున్నారు. కానీ, సినిమా రిలీజ్ ఏప్రిల్‌లో ఉండే అవకాశాలు లేవని..అందుకే మేకర్స్ అప్‌డేట్ ఏదీ ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే మాత్రం యష్ అభిమానులకు ఈసారి నిరాశే మిగులుతుందని చెప్పాలి. మరి చిత్రబృందం సడన్ సర్‌ప్రైజ్ ఏదైనా ఇస్తారేమో చూడాలి. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిలింస్ నిర్మిస్తోంది.   

Updated Date - 2022-01-06T16:14:54+05:30 IST