'రొమాంటిక్' బ్యూటీని చూస్తే హీటెక్కాల్సిందే..

'రొమాంటిక్' బ్యూటీని చూస్తే హీటెక్కాల్సిందే..ప్రస్తుతం నెటిజన్స్ ఇలాంటి కామెంట్సే యంగ్ హీరోయిన్ కేతిక శర్మను చూసి అంటున్నారట. ఇటీవలే పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ హీరోగా వచ్చిన 'రొమాంటిక్' సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చి బాగా ఆకట్టుకుంది కేతిక. ఇది తన మొదటి సినిమా. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'రొమాంటిక్' మూవీలో కేతిక అందాల ఆరబోతకు, లిప్ లాక్స్‌కు ఏమాత్రం అడ్డుచెప్పకుండా నటించింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా యూత్ ఆడియన్స్ మాత్రం కేతికకు ఫిదా అయ్యారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే నాగ శౌర్య హీరోగా వస్తున్న 'లక్ష్య' సినిమాలో అలాగే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాలో అవకాశాలు అందుకుంది. యంగ్ హీరోలకు ఈ 'రొమాంటిక్' బ్యూటీ మంచి ఛాయిస్ అని మేకర్స్ భావిస్తున్నారు. ఇలా టాలీవుడ్ మేకర్స్‌ను ఆకట్టుకుంటూనే ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ హాట్ ఫొటోషూట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి నెటిజన్స్‌కు హీటెక్కిస్తోంది. ప్రస్తుతం కేతికకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇలాగే గనక కొనసాగితే టాలీవుడ్‌లో మాత్రమే కాక సౌత్‌లోని మిగతా భాషలలోనూ క్రేజీ ఆఫర్స్ అందుకోవడం ఖాయం అని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఈ 'రొమాంటిక్' బ్యూటీ ఏరేంజ్‌లో స్టార్ డమ్ సంపాదించుకుంటుందో.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.