ఓటీటీలో కీర్తి సురేశ్ తమిళ సినిమా?

ABN , First Publish Date - 2022-01-23T19:28:25+05:30 IST

మహానటి’ తర్వాత కీర్తిసురేశ్ రేంజ్ పెరిగింది. తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ వరుసగా అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం తెలుగులో ‘సర్కారువారి పాట’ చిత్రంతో పాటు మెగాస్టార్ ‘భోళాశంకర్’ లో సిస్టర్ కేరక్టర్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘గుడ్‌లక్ సఖి’ చిత్రం విడుదలకు రెడీ అయింది. అలాగే నానీ ‘దసరా’ చిత్రంలోనూ కథానాయికగా నటిస్తోంది. మాతృభాష మలయాళంలోనూ ‘వాసి’ అనే మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉంటే కీర్తి తమిళంలో ఓ సెన్సేషనల్ మూవీలో నటిస్తోంది. దాని పేరు ‘సానిక్కాయిదం’. ధనుష్ సోదరుడు దర్శకుడు సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఓటీటీలో కీర్తి సురేశ్ తమిళ సినిమా?

‘మహానటి’ తర్వాత కీర్తిసురేశ్ రేంజ్ పెరిగింది. తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ వరుసగా అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం తెలుగులో ‘సర్కారువారి పాట’ చిత్రంతో పాటు మెగాస్టార్ ‘భోళాశంకర్’ లో సిస్టర్ కేరక్టర్ చేస్తోన్న సంగతి తెలిసిందే.  ‘గుడ్‌లక్ సఖి’ చిత్రం విడుదలకు రెడీ అయింది. అలాగే నానీ ‘దసరా’ చిత్రంలోనూ కథానాయికగా నటిస్తోంది. మాతృభాష మలయాళంలోనూ ‘వాసి’ అనే మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉంటే కీర్తి తమిళంలో ఓ సెన్సేషనల్ మూవీలో నటిస్తోంది. దాని పేరు ‘సానిక్కాయిదం’. ధనుష్ సోదరుడు దర్శకుడు సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కీర్తి కరుడు గట్టిన నేరస్థురాలిగా నటించనుండడం విశేషం. అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఓటీటీలో డైరెక్ట్ గా విడుదల కానుండడం హాట్ టాపిక్ అయింది. 


కీర్తి సురేశ్ నటించిన ‘పెంగ్విన్, మిస్ ఇండియా’ చిత్రాలు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘సానిక్కాయిదం’ చిత్రాన్ని కూడా అమెజాన్ వారికే విక్రయించారు మేకర్స్. దీనికోసం భారీ డీల్ ను ఓకే చేశారు మేకర్స్. కీర్తి ఈ మూవీలో మొట్టమొదటి సారిగా రా అండ్ రస్టిక్ కేరక్టర్ చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ‘సానిక్కాయిదం’ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.  

Updated Date - 2022-01-23T19:28:25+05:30 IST