అమ్మ నా ధైర్యం
ABN , First Publish Date - 2020-09-13T14:42:41+05:30 IST
‘పెంగ్విన్’ ఆశించినంత ఆనందం ఇచ్చిందో లేదో కానీ.. పెంగ్విన్‌లా నాజూగ్గా, సన్నగా మారానంటోంది కీర్తి...

మినిట్స్ కీర్తి సురేష్
‘పెంగ్విన్’ ఆశించినంత ఆనందం ఇచ్చిందో లేదో కానీ.. పెంగ్విన్‌లా నాజూగ్గా, సన్నగా మారానంటోంది కీర్తి...
‘మహానటి’ ఒక్కటి చాలు.. కీర్తి సురేష్ ప్రతిభను కొలవడానికి. ఈ మధ్యనే ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలైన పెంగ్విన్‌లో కూడా ఆమె అందర్నీ కంటతడి పెట్టించింది. ఒక తల్లిగా సున్నితమైన భావోద్వేగాన్ని అద్భుతంగా పలికించింది. సరే, ఆ సినిమా సంగతి అటుంచితే... ఈ కరోనా కాలంలో ఆమె ఏం చేస్తోంది..
ఆమె మూడ్ ఎలా ఉంది.. పలకరిద్దాం..
1. ‘పెంగ్విన్’కు మీరిచ్చే రేటింగ్?
నేను ఎమోషనల్‌గా చేసిన సినిమా కదా.. ఎంతయినా ఇచ్చుకుంటా!
2. ఫస్ట్ ఎవరితో చూశారు?
అమ్మతో...
3. అందులో మీకు నచ్చిన సీన్?
తప్పిపోయిన బిడ్డ కోసం తల్లి ఇంతగా తల్లడిల్లిపోతుందా.. అన్న దృశ్యాలు.
4. ఆ ఫిల్మ్‌పై వచ్చిన తాజా కాంప్లిమెంట్..
నిజంగా కన్నతల్లివి నువ్వే అన్నంత భావోద్వేగంతో చేశావు... అంది అమ్మ.
5. అంతగా నచ్చలేదన్న వ్యక్తి?
నా సోదరి రేవతి..
6. కరోనా కాలాన్ని ఎలా భరిస్తున్నారు..
ఖాళీ లేకుండా ఏదో ఒక పనిచేస్తున్నాను. ఊరికే ఉంటే బోర్ కొడుతుంది. బరువు తగ్గడానికి చాలా చేశాను.
7. ఈమధ్య ఏం వంట వండారు?
పప్పు, రసం, ఉల్లి దోశ
8. ఇప్పుడు ఏదైనా పుస్తకం చదువుతున్నారా.. ?
ఏమీ చదవడం లేదు. ఏదో నాకొచ్చిన ఐడియాతో ఒక చిన్న కథ రాశా.
9. మిమ్మల్ని ఫిదా చేసిన వెబ్‌సిరీస్..
చాలానే ఉన్నాయి.. ఒక్కటంటూ ఏమీ లేదు..
10. కరోనా నేర్పిన పాఠం. ఒక్కముక్కలో..
డబ్బు కాదు.. మానవత్వం మనిషికి చాలా అవసరమని నేర్పింది.
11. ఖాళీ టైమ్‌ను ఎలా సద్వినియోగం చేసుకున్నారు
ఖాళీగా ఉండకుండా ప్లాన్ చేసుకుంటా!
12. బాగా బోర్‌గా ఫీలైన రోజు..
లాక్‌డౌన్‌లో మొదటి వారం రోజులు, సెట్‌లో అయితే టేక్‌కి టేక్‌కి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు..
13. మీరు ఫాలో అవుతున్న డైట్ ప్లాన్.
మోతాదుకు మించకుండా నచ్చింది తింటా..
14. లాక్‌డౌన్ తరువాత షూటింగ్.. తొలి సినిమా ఏది
రజనీకాంత్ సర్‌తో చేస్తున్న సినిమా!
15. చైనా యాప్స్ నిషేధంపై మీ కామెంట్
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలి.
16. కరోనా పోయాక వెళ్లే తొలి టూర్ ఎక్కడికి
నాకు ఇష్టమైన యూరప్. ఈ పరిస్థితుల్లో ఏ ప్లాన్ లేదు.
17. బరువు పెరిగారా.. తగ్గారా?
బాగా తగ్గాను...
18. మహానటిని ఎన్నిసార్లు చూశారు
లెక్కేసుకోలేదు.. నాకు బాగా కనెక్ట్ అయిన సీన్స్ మాత్రం తరచూ చూస్తా.
19. కరోనా భయానికి మీరిచ్చే అభయం
ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ముందుగా గుర్తొచ్చేది అమ్మే. కరోనా కాలంలో ప్రతి ఇంట్లో ధైర్యం చెప్పేది అమ్మ ఒక్కతే. ‘నీకే కాదు’ అనే మాట అమ్మ నోట వేస్త మనకు వెయ్యేనుగుల బలం. అది నాకెప్పుడూ ఉంటుంది.. లాక్‌డౌన్ టైమ్‌లో ఇంకొంచెం ఎక్కువుంది. అమ్మతో ఇంట్లోనే ఉంటూ, కొత్త విషయాలు నేర్చుకున్నాను.
20. మీకు ఇష్టమైన ఫెర్‌ఫ్యూమ్
క్రిస్టియన్ డియోర్

21. ఆన్‌లైన్ గేమ్ ఆడతారా? ఏది?
ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే ఎక్కువ ఉపయోగిస్తా. పని ఉంటే తప్ప ఫోన్ పట్టుకోను.
22. మీ ఫేవరెట్ పెట్?
నా కుక్క పిల్ల నైకీ. అలాగే బర్డ్స్ కూడా!
23. తరచూ వీడియోకాల్స్‌లో మాట్లాడే ఆత్మీయులు?
నా స్కూల్ ఫ్రెండ్ ఆర్తి.
24. ఇష్టమైన హీరో
సూర్య.
- ఆలపాటి మధు