Goodluck sakhi : ట్రైలర్ వచ్చేసింది!

ABN , First Publish Date - 2022-01-24T16:37:00+05:30 IST

జాతీయ ఉత్తమనటి కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో.. నాగేష్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందిన గ్రామీణ నేపథ్యంలోని స్పోర్ట్స్ డ్రామా ‘గుడ్‌లక్ సఖి’. ఆది పినిశెట్టి హీరోగా, జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంది. కరోనా కారణంగా ఇప్పటికి చాలా సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఆసక్తికరమైన కథాకథనాలతో సినిమా రూపొందిందని ట్రైలర్ ను బట్టి అర్ధమవుతోంది.

ఓ గ్రామీణ యువతి జాతీయ స్థాయి షూటర్ గా ఎలా మారింది అనే ఆసక్తికరమైన కథాంశంతో ‘గుడ్‌లక్ సఖి’ చిత్రం రూపొందింది. దేశం గర్వపడేలా షూటర్స్ ను తయారుచేయబోతున్నానని జగపతి బాబు అనగా.. మన మధ్యే ఓ గొప్ప షూటర్ ఉందని ఆది చెబుతుండగా.. కీర్తి సురేశ్ ను రివీల్ చేయడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అయితే ఆ గ్రామంలో అందరూ కీర్తిని బ్యాడ్ లక్ సఖి గా చూస్తారు. ఎందుకంటే... ఆమె అందరికీ దురదృష్టాన్ని తెచ్చిపెడుతుందని వారి నమ్మకం. ఆడవారికి షూటింగ్ ఏంటని గ్రామస్థులు వ్యతిరేకించగా.. ఆమె పేరునే కోచ్ జగపతిబాబు ప్రతిపాదిస్తాడు. చివరికి కీర్తి సురేశ్ ఆయన నమ్మకాన్ని నిలబెట్టి.. ‘గుడ్‌లక్ సఖి’ అని ఎలా అనిపించుకుంటుంది అన్నదే ఈ సినిమా కథ. ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. మరి ‘గుడ్‌లక్ సఖి’ గా కీర్తి సురేశ్ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో చూడాలి. 

Updated Date - 2022-01-24T16:37:00+05:30 IST