సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన ‘మహానటి’

ABN , First Publish Date - 2022-01-27T13:56:32+05:30 IST

జాతీయ ఉత్తమ నటి కీర్తిసురేశ్.. తాజా చిత్రం ‘గుడ్‌లక్ సఖి’ విడుదలకు సిద్ధమైంది. మహేశ్ బాబు సరసన ‘సర్కారువారి పాట’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. అలాగే. చిరంజీవి ‘భోళాశంకర్’ లోనూ, నానీ ‘దసరా’ చిత్రంలోనూ, మలయాళ చిత్రం ‘వాసి’ లోనూ నటిస్తోంది. వీటితో పాటు ‘సానిక్కాయుదం’ తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది కీర్తి. ఈ నేపథ్యంలో తను సొంత యూ ట్యూబ్ ఛానల్ ను ప్రారంభించినట్టు ప్రకటించి అభిమానుల్ని ఖుషీ చేసింది.

‘హాలో.. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. సొంత యూ ట్యూబ్ ఛానల్ ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది. లింక్ మీద క్లిక్ చేసి నా ఛానల్ ను సబ్ స్ర్కైబ్ చేసి తిలకించండి’... అంటూ కీర్తి సురేశ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ పోతినేని, దుల్ఖర్ సల్మాన్, కాజల్ అగర్వాల్  లాంటి సౌత్ సెలబ్రిటీస్  తో పాటు  అజయ్ దేవ్ గన్, ఆలియాభట్, ప్రియాంకా చోప్రా, అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, శిల్పాశెట్టి లాంటి బాలీవుడ్ సెలెబ్రిటీస్  కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తుండడం విశేషం.  మరి కీర్తి ఛానల్ ఏ స్థాయిలో క్లిక్ అవుతుందో చూడాలి. 

Updated Date - 2022-01-27T13:56:32+05:30 IST