మూడు సినిమాల్లో చెల్లెలిగా కీర్తి సురేశ్ ?

ABN , First Publish Date - 2021-09-24T21:24:02+05:30 IST

‘నేను శైలజ’తో టాలీవుడ్ లోకి కథానాయికగా అడుగుపెట్టి.. ‘మహానటి’తో నేషనల్ అవార్డ్ ను సైతం కైవసం చేసుకున్నారు అందాల కీర్తి సురేశ్. ప్రస్తుతం దక్షిణాదిన కథానాయికగా ఫుల్ బిజీగా ఉన్న ఆమె.. ఒకవైపు యంగ్ హీరోల సరసన కథానాయికగా నటిస్తూనే.. మరో వైపు పాత్ర నచ్చితే సీనియర్ హీరోలకు చెల్లెలి పాత్రలకు కూడా రెడీ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

మూడు సినిమాల్లో చెల్లెలిగా కీర్తి సురేశ్ ?

‘నేను శైలజ’తో టాలీవుడ్ లోకి  కథానాయికగా అడుగుపెట్టి.. ‘మహానటి’తో నేషనల్ అవార్డ్ ను సైతం కైవసం చేసుకున్నారు అందాల కీర్తి సురేశ్. ప్రస్తుతం దక్షిణాదిన కథానాయికగా ఫుల్ బిజీగా ఉన్న ఆమె.. ఒకవైపు యంగ్ హీరోల సరసన కథానాయికగా నటిస్తూనే.. మరో వైపు పాత్ర నచ్చితే సీనియర్ హీరోలకు చెల్లెలి పాత్రలకు కూడా రెడీ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం కీర్తి.. ఓ మూడు సినిమాల్లో సినియర్ స్టార్స్ కు లవబుల్ సిస్టర్ గా అలరించేందుకు రెడీ అవుతున్నారు. కీర్తి ప్రస్తుతం నటిస్తోన్న అరడజను చిత్రాల్లో.. మూడు సినిమాల్లో చెల్లెలిగా నటిస్తూండడం విశేషం. 


వాటిలో మొదటిది మెగాస్టార్ చిరంజీవి , మెహర్ రమేశ్ మాస్ యాక్షన్ మూవీ ‘భోలాశంకర్’. తమిళ ‘వేదాళం’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్లో లక్ష్మీ మీనన్ చేసిన పాత్రనే ఇందులో కీర్తి చేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ రజినీ లేటెస్ట్ మూవీ ‘అన్నాత్త’ లోనూ కీర్తి రజినీ కి చెల్లెలిగా ఆకట్టుకోనుందని సమాచారం. అలాగే.. సెల్వరాఘవన్ నటుడిగా ఎంట్రీ ఇస్తూ.. రూపొందిస్తున్న ‘సానికాయిదమ్’ లో కీర్తి.. ఆయనకి చెల్లిలిగా నటిస్తున్నారని తెలుస్తోంది. మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి డీ గ్లామర్ రోల్ లో కనిపించనుందట. మొత్తానికి కీర్తి సురేశ్.. కేవలం హీరోయిన్ గానే నటిస్తానని గిరి గీసుకు కూర్చోకా.. ప్రధాన పాత్ర అనుకుంటే చెల్లెలిగా కూడా నటించడానికి రెడీ అవుతూండడం అందరినీ ఆకట్టుకుంటోంది.  

Updated Date - 2021-09-24T21:24:02+05:30 IST