మెహందీ ఫంక్షన్ కోసం భారీగా ఖర్చు చేస్తున్న కత్రినా కైఫ్

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్‌లో డిసెంబరు తొలివారంలో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది.  ముంబైలో నవంబర్ చివరివారంలో ముందుగా వీరు కోర్టు మ్యారేజ్ చేసకొబోతున్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఇప్పటి వరకు ఈ వదంతులపై ఎవరూ కూడా స్పందించలేదు. కానీ, వీరి పెళ్లికి సంబంధించిన పనులు మాత్రం చకచక జరుగుతున్నాయి.


కత్రినా కైఫ్ పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. మెహందీ ఫంక్షన్‌లో పెట్టుకునే హెన్నా కోసం ఆమె భారీగానే ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ హెన్నా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి వస్తున్నట్టు దగ్గరి సంబంధీకులు తెలుపుతున్నారు. హెన్నా కోసమే దాదాపుగా రూ.1 లక్ష ఖర్చు చేస్తుందన్నారు. జోధ్‌పూర్‌లోని పాలీ నుంచి ఈ హెన్నాను తెప్పిస్తున్నారు. సహజసిద్ధ  పద్ధతుల్లో, ఎటువంటి రసాయనాలు కలపకుండా చేతితో దీనిని తయారు చేస్తున్నారు. అందువల్ల దీని ధర ఎక్కువగా ఉందని సమాచారం. హెన్నాను తయారు చేసిన వ్యక్తి సెలెబ్రిటీ కఫుల్ నుంచి డబ్బులు తీసుకోకపోవడం విశేషం.  

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.