Katrina Kaif: తల్లి కాబోతున్న కత్రినా..? ఆ వైరల్ వీడియోలో ఏముందంటే..
ABN , First Publish Date - 2022-08-17T16:46:56+05:30 IST
బాలీవుడ్‌లోని క్రేజీ హీరోయిన్స్‌లో కత్రినా కైఫ్ (Katrina Kaif) ఒకరు. ఈ బ్యూటీ గతేడాది డిసెంబర్‌లో ప్రముఖ నటుడు విక్కీ కౌశల్..
బాలీవుడ్‌లోని క్రేజీ హీరోయిన్స్‌లో కత్రినా కైఫ్ (Katrina Kaif) ఒకరు. ఈ బ్యూటీ గతేడాది డిసెంబర్‌లో ప్రముఖ నటుడు విక్కీ కౌశల్(Vicky Kaushal)ని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ జంట గురించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. గతకొంతకాలంగా ఈ కపుల్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కత్రినా ముంబైలో ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో కత్రినా వైట్ టీషర్ట్, ఆరెంజ్ కలర్ ప్యాంట్‌లో చాలా స్టైలిష్‌గా ఉంది. అయితే ఈ బ్యూటీ కొంచెం లావైనట్లు కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా కత్రినా బరువు పెరగకుండా చాలా జాగ్రత్తగా ఫిజిక్‌ని మెయిన్‌టెన్ చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ తార లావుగా కనిపించడానికి కారణం ఆమె గర్భవతి(Pregnant) కావడమే కారణమంటూ నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆమె గర్భవతిలా కనిపిస్తోంది. అది నిజమైతే చాలా బావుండు’ అంటూ కొందరు.. ‘త్వరలో క్యాట్ శుభవార్త చెప్పబోతోంది. ఆమె గర్భవతిలా కనిపిస్తోంది’ అని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు.