కట్రీనా పెళ్లి నిజమేనా?

ABN , First Publish Date - 2021-11-06T00:03:38+05:30 IST

బాలీవుడ్‌ బ్యూటీ కట్రీనా కైఫ్‌ పెళ్లి వార్త మరోసారి వైరల్‌ అయింది. గత కొద్ది రోజులుగా ప్రియుడు విక్కీ కౌశల్‌తో ఏడడుగులు వేయనుందనే వార్తలు బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే! పెళ్లి విషయంలో పలు రూమర్లు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ దీపావళి సందర్భంగా నిర్మాత ఆర్తీ శెట్టి నివాసం వద్ద కెమెరా కంటికి చిక్కడంతో ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది.

కట్రీనా పెళ్లి నిజమేనా?

బాలీవుడ్‌ బ్యూటీ కట్రీనా కైఫ్‌ పెళ్లి వార్త మరోసారి వైరల్‌ అయింది. గత కొద్ది రోజులుగా ప్రియుడు విక్కీ కౌశల్‌తో ఏడడుగులు వేయనుందనే వార్తలు బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే! పెళ్లి విషయంలో పలు రూమర్లు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ దీపావళి సందర్భంగా నిర్మాత ఆర్తీ శెట్టి నివాసం వద్ద కెమెరా కంటికి చిక్కడంతో ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది. ఈ లవ్‌బర్డ్స్‌ సైలెంట్‌గా పెళ్లి పనులు రహస్యంగా చేసుకుపోతున్నారనీ, అందుకే ఇన్విటేషన్స్‌ కూడా ఎవరికీ పంపడం లేదని బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. విక్కీ కౌశల్‌ తల్లి కట్రీనాకు దీపావళి సందర్భంగా చీర బహుమతిగా పంపారని వినిపిస్తోంది. డిసెంబర్‌ 7 లేదా 9  తేదీల్లో  రాజాస్థాన్‌లో వైభవంగా పెళ్లి పీటలెక్కేందుకు సిద్థమవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో కట్రీనా నోరు కూడా మెదపలేదు. అయితే బాలీవుడ్‌ కోడై కూస్తున్న ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే కట్రీనా, విక్కీ కౌశల్‌ మాట్లాడాల్సిందే! 



Updated Date - 2021-11-06T00:03:38+05:30 IST