Katrina Kaif నిజమైన వయసు ఎంతో తెలుసా..? Vicky Kaushal కంటే వయసులో ఎంత పెద్ద అంటే..

కత్రీనా, విక్కీ కౌశల్ వెడ్డింగ్... గత కొన్ని రోజులుగా ఇదే ప్రచారంతో బాలీవుడ్ మార్మోగిపోయింది. రోజుకొక కొత్త విషయంతో మీడియా కూడా గుప్పుమంటూ వచ్చింది. ఎట్టకేలకు డిసెంబర్ 9, ద బిగ్ డే... రానే వచ్చేసింది! మిస్ కైఫ్ ఇప్పుడు విక్కీ కౌశల్ వైఫ్... దాదాపుగా అయిపోయినట్టే! అయితే, ఇంత వరకూ ఎవరూ అధికారికంగా ధృవీకరించకపోవటమే కొస మెరుపు!


కత్రీనా కళ్యాణం చుట్టూ ముసురుకుంటూ వచ్చిన పుకార్లు పక్కన పెడితే ఒక్క విషయంలో మాత్రం అందరికీ క్లారిటీ ఉంది. అదే... కొత్త పెళ్లి కూతురి వయస్సు! విక్కీ కంటే క్యాట్ కనీసం 5 సంవత్సరాలు పెద్ద! ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అయితే, అబ్బాయి కంటే అమ్మాయి ఏజ్‌లో సీనియర్ కావటం మనకు మరీ కొత్త కూడా కాదు. బాలీవుడ్‌కు బయట సచిన్, అంజలి లాంటి జంటలు ఏజ్ గ్యాప్ రూల్స్ పట్టించుకోలేదు. ఇక బీ-టౌన్‌ లోపల కూడా అభిషేక్, ఐశ్వర్య లాంటి వారు రొటీన్‌కి భిన్నంగా పెళ్లి పీటలు ఎక్కేశారు. ఇఫ్పుడు కత్రీనా కూడా విక్కీ కౌశల్ కంటే కాస్త పెద్దదే. నిజంగా చెప్పుకుంటే... ఇదేం విశేషం కాదు. కానీ, ‘కత్రీనా రియల్ ఏజ్’ అంటూ బాలీవుడ్‌లో ఓ చర్చ ఎప్పట్నుంచో సాగుతోంది. అదే ఇప్పుడు మరోసారి ఆన్‌లైన్‌లో నెటిజన్స్ ముందుకొచ్చింది...


అనేక కాంట్రవర్సీలకు కేంద్రంగా నిలిచే ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఓ సారి దీపిక తనకు కత్రీనా పాస్‌పోర్ట్ చూడాలని ఉందంటూ కామెంట్ చేసింది. దానర్థం క్యాట్ రియల్ ఏజ్ ఎంతో తెలుసుకోవాలని డీపికి మనసులో కోరికగా ఉందని! అంతే కాదు, దీపిక ఇన్‌డైరెక్ట్‌గా కత్రీనా పైకి ప్రచారం జరుగుతోన్నంత చిన్నదేం కాదని... చెప్పకనే చెప్పింది!


దీపిక కామెంట్ ఒక్కటే కాదు... 2007లో కత్రీనా బర్త్ డే పార్టీ జరిగింది. అందులోనే షారుఖ్, సల్మాన్ తీవ్రంగా గొడవపడ్డారు. చాలా రోజులు ఇద్దరి మధ్యా మాటలు ఆగిపోయాయి. అయితే, 2007లో జరిగిన కాంట్రవర్సియల్ కత్రీనా బర్త్ డే పార్టీ 27వది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది! అంటే, 2007లో క్యాట్ వయస్సు కనీసం 27గా భావించాల్సిందే. అప్పట్నుంచి ఇప్పటిదాకా లెక్క వేస్తే ఆమె ఏజ్ 40 అంటున్నారు నెటిజన్స్! విక్కీ కౌశల్ మాత్రం 33 ఏళ్లే! సో... బాలీవుడ్ కొత్త జంట మధ్య ఏజ్ గ్యాప్ ఏడు సంవత్సరాలు కూడా అయ్యి ఉండవచ్చు!


ఒకవైపు కొందరు కత్రీనా ఏజు చాలా ఎక్కువంటూ రాగాలు తీస్తోంటే... మరికొందరు మాత్రం, అసలు వారి మధ్య గ్యాప్ ఎంతుంటే మనకెందుకని ప్రశ్నిస్తున్నారు. కామన్ నెటిజన్స్ మాత్రమే కాదు కంగనా రనౌత్ లాంటి ఫైర్ బ్రాండ్ కూడా విక్యాట్ జంటని ఇన్‌స్టాగ్రామ్‌లో మెచ్చుకుంది. ‘అమ్మాయి ఏజ్ తక్కువుండాలి’ అనే స్టీరియోటైప్ మెంటాలిటీని వారిద్దరూ బ్రేక్ చేశారంటూ కితాబునిచ్చింది! చూడాలి మరి, మిష్టర్ అండ్ మిసెస్ విక్కీ కౌశల్ అఫీషియల్ అప్పియరెన్స్ తమ అభిమానులకి ఎప్పుడు ఇస్తారో... 

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.