కత్రినా కైఫ్‌కు కాసుల వర్షం కురిపిస్తున్న నైకా షేర్లు
ABN , First Publish Date - 2021-11-11T01:13:18+05:30 IST
ఆన్లైన్ వేదికగా బ్యూటీ ఉత్పత్తులను విక్రయించే సంస్థ నైకా. ఈ సంస్థ షేర్లు నవంబర్ 10న ఎన్ఎస్ఈ (నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్)తో పాటు బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్చేంజ్)లో లిస్ట్ అయ్యాయి.

ఆన్లైన్ వేదికగా బ్యూటీ ఉత్పత్తులను విక్రయించే సంస్థ నైకా. ఈ సంస్థ షేర్లు నవంబర్ 10న ఎన్ఎస్ఈ (నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్)తో పాటు బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్చేంజ్)లో లిస్ట్ అయ్యాయి. ఈ సంస్థ షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్ల్లో లిస్ట్ కావడంతో కత్రినా కైఫ్ సంతోషంలో మునిగి తేలుతుంది. అందుకు కారణమేమిటంటే..
కత్రినా కైఫ్‌కు నైకా కంపెనీలో వాటా ఉంది. 2019లో తన సొంత బ్రాండ్ అయిన ‘‘ కే బ్యూటీ ’’ని నైకాలో ఆమె లాంచ్ చేసింది. ఆ కంపెనీలో తను ఇన్వెస్టర్ అనే విషయాన్ని ఆమె గత ఏడాదే వెల్లడించింది. నైకా సంస్థ ఐపీఓ( ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.5,352 కోట్లను సమీకరించింది. అందువల్ల ఆ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో లిస్ట్ అవుతున్న సందర్భంగా ఆమె హాజరయి తన సంతోషాన్ని వెలిబుచ్చింది.
నైకాలో ఇన్వెస్ట్ చేయడానికి గల కారణమేమింటని కత్రినాకైఫ్‌ని అడగగా..‘‘ నైకా ఉత్పత్తుల గురించి నాకు తెలుసు. బ్యూటీ ఉత్పత్తుల విభాగంలో ఆ సంస్థ లీడర్షిప్ పొజిషన్లో ఉంది. ఆ సంస్థకు ఒక విజన్ ఉంది ’’ అని ఆమె ఒక ఇంటర్వ్యూలో సమాధానమిచ్చింది.
ఫల్గుణి నాయర్ అనే ఇన్వెస్టమెంట్ బ్యాంకర్ నైకాను 2012లో స్థాపించారు. ఆ కంపెనీ రూ.1125లకు షేర్లను ఆఫర్ చేయగా ఎన్ఎస్ఈలో దాదాపుగా 80శాతం ప్రీమియంతో రూ. 2018వద్ద లిస్ట్ అయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆ కంపెనీ షేర్లు 2205.80 వద్ద స్థిరపడ్డాయి.