‘అల వైకుంఠపురములో’ కాంట్రవర్సీ: ‘బుట్టబొమ్మ’ పాటకి కార్తీక్ ఆర్యన్ డ్యాన్స్.. వైరల్ అవుతున్న పాత వీడియో

ABN , First Publish Date - 2022-01-26T18:20:30+05:30 IST

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాలీవుడ్‌లో రిమేక్ అవుతున్న విషయం తెలిసిందే...

‘అల వైకుంఠపురములో’ కాంట్రవర్సీ: ‘బుట్టబొమ్మ’ పాటకి కార్తీక్ ఆర్యన్ డ్యాన్స్.. వైరల్ అవుతున్న పాత వీడియో

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాలీవుడ్‌లో రిమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ‘షాహ్‌‌జాదా’గా వస్తున్న ఈ మూవీకి రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తుండగా.. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు.


అయితే అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘పుష్ప: ది రైజ్’ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో స్టైలిష్ స్టార్ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అందుకే దీన్ని క్యాష్ చేసుకునేందుకు రెండేళ్ల క్రితం వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా రైట్స్ కొనుకుని డబ్బింగ్ చేశాడు నిర్మాత మనీష్ షా. ఈ హిందీ వెర్షన్‌ని థియేటర్స్‌లో భారీస్థాయిలో విడుదల చేయాలని భావించాడు. అయితే రూ.40 కోట్ల నష్టం వస్తుందనే ‘షాహ్‌జాదా’ నిర్మాతల అభ్యర్థన మేరకు ఆ ఆలోచనని విరమించుకుని టీవీ ఛానెల్‌లో ప్రసారం చేయనున్నాడు ఈ ప్రొడ్యూసర్.


దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మనీష్ మాట్లాడుతూ.. ‘తన సినిమా థియేట్రికల్‌గా రిలీజైతే ‘షాహ్‌జాదా’ నుంచి తప్పుకుంటానని యంగ్ హీరో, నిర్మాతలని బెదిరించాడు. అది ఏ మాత్రం ప్రొఫెషనలిజం కాదు‌’ అని కార్తీక్ ఆర్యన్‌పై విమర్శలు చేశాడు. అయితే అనంతరం ఆ యువ నటుడు తమను బెదిరించలేదని ఆ మూవీ నిర్మాతలు ఈ హీరోకి సపోర్టుగా నిలిచారు.


ఇలా ‘అలవైకుంఠపురములో’ కాంట్రవర్సీ కొనసాగుతోంది. అయితే గతంలో ఈ సినిమా తెలుగు వెర్షన్‌లోని ‘బుట్టబొమ్మ’ పాటకి డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు కార్తీక్ ఆర్యన్. ఆ పాత వీడియోని కోటి మందికి పైగా చూశారు. దీంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


దీంతో ఈ వీడియోపై ఎంతోమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ‘చాలా బాగా చేశావు’ అంటూ ప్రశంసిస్తుండగా.. మరికొందరు ‘అల్లు అర్జున్ స్టైల్‌ని మ్యాచ్ చేయలేకపోయావు’ అని విమర్శలు చేస్తున్నారు. ఆ వైరల్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..



Updated Date - 2022-01-26T18:20:30+05:30 IST