Karthikeya 2 : బాలీవుడ్‌‌లో మరో ‘పుష్ప’

ABN , First Publish Date - 2022-08-17T00:14:54+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ (Nikhil), మల్లూ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జోడీగా నటించిన స్పిరిట్యువల్ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’ (Karthikeya 2). విడుదలైన తొలిరోజు నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ వసూళ్ళను రాబడుతోంది.

Karthikeya 2 : బాలీవుడ్‌‌లో మరో ‘పుష్ప’

యంగ్ హీరో నిఖిల్ (Nikhil), మల్లూ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జోడీగా నటించిన స్పిరిట్యువల్ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’ (Karthikeya 2). విడుదలైన తొలిరోజు నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ వసూళ్ళను రాబడుతోంది. పదకొండు రోజుల్లోనూ టాలీవుడ్‌లో రికార్డు స్థాయి కలెక్షన్స్ తెచ్చుకున్న ఈ సినిమా.. బాలీవుడ్‌లో అయితే ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరిచే రీతిలో దుమ్మురేపుతోంది. అక్కడ విడుదలైన రెండో రోజు నుంచే ఈ సినిమా స్ర్కీన్స్, షోస్ పెరిగిపోయాయి. మూడో రోజు, నాలుగో రోజు వాటి సంఖ్య మరింతగా పెరిగింది. సోమవారం ఈ సినిమాకి హిందీలో మాత్రమే కోటి రూపాయల దాకా గ్రాస్ వసూళ్ళు రావచ్చని అంచనా వేస్తున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘లాల్ సింగ్ చడ్డా (Laalsingh chadda), రక్షాబంధన్ (Rakshabandhan)’ చిత్రాల స్ర్కీన్స్ తగ్గించి మరీ దీనికి కేటాయిస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 


మొదటి భాగం ‘కార్తికేయ’ (Karthikeya) చిత్రం హిందీ వెర్షన్ ను యూట్యూబ్ లో చూసి ఉండొచ్చు కానీ.. ఆ సినిమా గురించి బాలీవుడ్ రెగ్యులర్ థియేట్రికల్ ఆడియన్స్‌కు పెద్దగా తెలియదు. దాని సీక్వెల్‌గా ఎనిమిదేళ్ళ తర్వాత ‘కార్తికేయ 2’ వస్తే దీని గురించి కూడా అక్కడ ఆడియన్స్ కు పెద్దగా తెలియలేదు. హిందీ వెర్షన్ కు అంతగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. ‘లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్’ చిత్రాల వల్ల ‘కార్తికేయ 2’ కి థియేటర్స్ దొరకలేదు. అందుకే నామ మాత్రంగా పరిమిత థియేటర్స్ లోనే చిత్రాన్ని ప్రదర్శించారు. కట్ చేస్తే కథ మొత్తం మారిపోయింది. తొలి రోజునుంచే చిత్రానికి షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది.


శ్రీకృష్ణుడు గురించి, పురాణాల గురించి గొప్పగా చెప్పడం, దానికి తోడు ఆసక్తికరమైన కథాకథనాలతో చిత్రం తెరకెక్కడంతో నార్త్ ఇండియన్ ఆడియన్స్ ‘కార్తికేయ 2’ చిత్రానికి ఫిదా అయిపోయారు. అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప’ (Pushpa) చిత్రం కూడా బాలీవుడ్ లో అంతగా అంచనాలు లేకుండా విడుదలై.. వసూళ్ళ సునామీ సృష్టించింది. అక్కడ రెగ్యులర్ సినిమాల్ని తలదన్నే రీతిలో వసూళ్ళు కురిపించి సత్తా చాటుకుంది. ‘కార్తికేయ 2’ చిత్రం ఆ రేంజ్ లో కాకపోయినా.. దాని బడ్జెట్‌కు సరిపడే స్థాయిలో అక్కడ సంచలనం సృష్టించడం సాధారణమైన విషయం కాదు. మరి ఈ సినిమా బాలీవుడ్‌లో లాంగ్ రన్‌లో ఇంకే స్థాయి వసూళ్ళు కురిపిస్తుందో చూడాలి. 

Updated Date - 2022-08-17T00:14:54+05:30 IST