బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించబోతున్న లేటెస్ట్ సినిమా 'సత్యనారయణ్ కీ కథ. ఇందులో ఈ యంగ్ హీరోకి జంటగా శ్రద్ధ కపూర్ నటించబోతోందని బీ టౌన్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాను సాజిద్ నడియాడ్ వాలా నిర్మాణంలో తెరకెక్కించబోతున్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా కార్తీక్ ఆర్యన్, శ్రద్ధా కపూర్ కాంబోని సాజిద్ నడియాడ్ వాలా సెట్ చేసేందుకు ట్రై చేస్తున్నారట. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతక ముందు సినిమా వస్తుందని ప్రచారం జరిగింది..కానీ కుదరలేదు. ఎట్టకేలకి 'సత్యనారయణ్ కీ కథ'లో కలిసి నటించనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్లో శ్రద్ద కపూర్‌కి లక్కీ హీరోయిన్ అని పేరుంది. ఇప్పటికే టైగర్ ష్రాఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధవన్ లాంటి యంగ్ హీరోలతో చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ క్రేజీ కాంబినేషన్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలున్నాయి.