Sardar Twitter Review : కార్తీ మూవీ గురించి నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-10-21T16:32:58+05:30 IST

తమిళ నటుడు కార్తీ‌ (Karthi)కి టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉంది. అందుకే ఆయన ప్రతి సినిమా కోలీవుడ్‌ (Kollywood) తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదల అవుతుంటుంది..

Sardar Twitter Review : కార్తీ మూవీ గురించి నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

తమిళ నటుడు కార్తీ‌ (Karthi)కి టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉంది. అందుకే ఆయన ప్రతి సినిమా కోలీవుడ్‌ (Kollywood) తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదల అవుతుంటుంది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాతో మంచి హిట్ కొట్టి జోష్ మీద ఉన్న కార్తీ తాజాగా మరో చిత్రం ‘సర్దార్’ (Sardar)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశాల్ నటించిన అభిమన్యుడు ఫేమ్ పిఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ నేడు (అక్టోబర్ 21) విడుదలైంది. (Sardar Twitter Review)


 రాశి ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేసింది. అయితే.. ఈ సినిమాకి సంబంధించి యూఎస్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోలు పడిపోయాయి. దాంతో.. పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ ఎలా ఉందో పంచుకున్నారు. అందులో.. ‘ఇప్పుడే సర్దార్ చూశాను. సరైన దివాళి మాస్ ఎంటర్‌‌టైనర్. కార్తీ ఇరగదీశాడు’ అని ఓ నెటిజన్.. ‘కార్తీకి 2022 సంవత్సరం గుర్తుండిపోతుంది. వరుసగా 3 హిట్స్ ఇచ్చాడు’ అని ఇంకొకరు రాసుకొచ్చారు. అలాగే.. మరి కొందరి రివ్యూలు ఎలా ఉన్నాయో చూద్దాం..















Updated Date - 2022-10-21T16:32:58+05:30 IST