పెద్ద తెర మీదకి... మాజీ ముఖ్యమంత్రి!
ABN , First Publish Date - 2022-02-21T00:48:59+05:30 IST
ర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడియూరప్ప సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘తనూజ’ అనే కన్నడ మూవీలో నటించనున్నారు. ఈ సినిమాలో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని హరీష్ ఎమ్ డి హల్లి తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఆయనపై కొంత భాగాన్ని చిత్రీకరించారు. సినిమాలో యడ్డీ అద్భుతంగా నటించారని శాండల్ వుడ్ మీడియా తెలుపుతోంది. ఈ చిత్రాన్ని ‘బియాండ్ విజన్ సినిమాస్’ నిర్మిస్తోంది. బెంగళూరు, శివమొగ్గ వంటి ప్రాంతాల్లో ఈ మూవీని చిత్రీకరించారని తెలుస్తోంది. ప్రద్యోతన సంగీతం అందించారు. రవీంద్రనాథ్ సినీమాటోగ్రాఫర్‌గా, ఆర్.బి. ఉమేశ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనూజ అనే యువతి కరోనాతో నీట్ పరీక్షలను రాయలేకపోయింది. కోవిడ్‌ను జయించి అనంతరం ఆమె ఇధ్దరు జర్నలిస్టుల సహాయంతో ఆ పరీక్షను పూర్తి చేసింది. ఎగ్జామ్‌ను రాయడానికి దాదాపుగా ఆమె 350కిలోమీటర్లు ప్రయాణించింది. నీట్ పరీక్షలోను ఉత్తీర్ణురాలయింది. ఈ యువతి ఉదంతం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.