Karthi : తాజా చిత్రం విడుదల అప్పుడే !

ABN , First Publish Date - 2022-05-22T17:52:16+05:30 IST

గతేడాది ‘సుల్తాన్’ (Sulthan) చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు తమిళ స్టార్ హీరో కార్తీ (Kargthi). ఆ సినిమా పర్వా లేదనిపించుకుంది. తదుపరిగా కార్తీ మరో ఐదు సినిమాల్ని లైన్ లో పెట్టుకున్నాడు. వాటిలో మణిరత్నం హిస్టారికల్ డ్రామా ‘పొన్నియన్ సెల్వన్’ (Ponnnian Selvan) పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

Karthi : తాజా చిత్రం విడుదల అప్పుడే !

గతేడాది ‘సుల్తాన్’ (Sulthan) చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు తమిళ స్టార్ హీరో కార్తీ (Kargthi). ఆ సినిమా పర్వా లేదనిపించుకుంది. తదుపరిగా కార్తీ మరో ఐదు సినిమాల్ని లైన్ లో పెట్టుకున్నాడు. వాటిలో మణిరత్నం హిస్టారికల్ డ్రామా ‘పొన్నియన్ సెల్వన్’ (Ponnnian Selvan)  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీంతో పాటు కార్తి నటించిన మరో చిత్రం విరుమన్ (Viruman) కూడా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే చిత్రానికి విడుదల తేదీని కూడా ప్రకటించారు. ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 31వ తేదీన ఆ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఆ చిత్ర నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్స్ (2D Entertainments) అధికారికంగా ప్రకటించింది. 


హీరో కార్తీ (Karthi) - ముత్తయ్య (Muttayya) కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కడైకుట్టి సింగం’  (Kadaikutti singaqm) మంచి సక్సెస్ సాధించింది. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. హీరో సూర్య (Surya) - జ్యోతిక (jyothika) దంపతులకు చెందిన 2డి ఎంటర్‌టైన్మెంట్స్ (2D Entertainments) నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర్‌ కుమార్తె అదితి శంకర్‌ (Adithi Shankar) తొలిసారి కోలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. 


తేని, మధురై తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ పూర్తి చేసుకున్న విరుమన్ (Viruman) చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ ప్రాజెక్టు గురించి హీరో కార్తీ (Karthi) స్పందిస్తూ.. ‘అదితికి మంచి భవిష్యత్‌ ఉంది. ఆమెతో కలిసి నటించిన రోజులు హాయిగా గడిచిపోయాయి. ఈ ప్రాజెక్టు కోసం మళ్ళీ యువన్‌ శంకర్‌ రాజాతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది.’ అన్నారు. మరి ఈ సినిమా కార్తీకి ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. 

Updated Date - 2022-05-22T17:52:16+05:30 IST