ఆ మాటంటే తైమూర్‌కి కోపం.. నా మీదే అరుస్తాడు: Kareena Kapoor

బాలీవుడ్ నటి కరీనా కపూర్, నటుడు సైఫ్ అలీఖాన్ ప్రేమ వివాహం గురించి తెలిసిందే. అనంతరం ఈ జంటకి ఇద్దరూ కుమారులు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీఖాన్. అయితే ఇద్దరిలో పెద్ద కొడుకైన తైమూర్ తనని చాలా విసిగిస్తున్నాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ఈ బ్యూటీ.


కరీనా ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ‘బయటికి వెళ్లి అడుకోమని మీ పిల్లలను ఎంకరేజ్ చేస్తారా?’ అని అడిగింది యాంకర్. దానికి సమాధానంగా.. ‘నా పిల్లలు చాలా యాక్టివ్. తైమూర్ అయితే ఒక్క నిమిషం కూడా కుదురుగా కూర్చోడు. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఒకటే ఆట. మేము ప్రస్తుతం పటౌడీలోని ప్యాలెస్‌లో ఉంటున్నాం. అక్కడ ఎంత ఖాళీ స్థలం ఉంటుందో, ఎన్ని చెట్లు ఉంటాయో మీకు తెలుసు. ఇంటి చుట్టూ పరిగెడుతుంటాడు. చెట్లను ఎక్కుతుంటాడ’ని చెప్పింది ఈ బ్యూటీ.


అంతేకాకుండా.. ‘నిజానికి అతను నన్ను అలసిపోయేలా చేస్తున్నాడు. అందుకే కొంచెం అతన్ని రెస్ట్ తీసుకోమని నేను తరచూ చెబుతుంటాను. కానీ తను సెలవులో ఉన్నానని, ఎందుకు ఆడుకోకుండా కామ్‌గా ఉండమని చెబుతున్నావంటూ నా మీద అరుస్తుంటాడు. నాలుగున్నరేళ్ల వయస్సులో సెలవు అంటే యాక్టివ్‌గా ఉండటమేనని తైమూర్ అనుకుంటూ ఉంటాడ’ కరీనా తెలిపింది.


కాగా, కరీనా ప్రస్తుతం ఆమీర్ ఖాన్ హీరోగా ‘లాల్ సింగ్ చద్ధా’ అనే సినిమా చేస్తోంది. హాలీవుడ్ హిట్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కి రిమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, మోనా సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కోవిడ్ 19 కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 14, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.