Kareena Kapoor: ఆలియా నిర్ణయం ధైర్యవంతమైనది

Twitter IconWatsapp IconFacebook Icon
Kareena Kapoor: ఆలియా నిర్ణయం ధైర్యవంతమైనది

చిన్న తనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ కరీనా కపూర్ (Kareena Kapoor). ‘జబ్ వి మెట్’, ‘త్రీ ఇడియట్స్’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) లో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కరీనా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది. 


ఆలియా భట్ (Alia Bhatt) 29ఏళ్లకే తల్లి కావాలనుకోవడం అనేది గొప్ప, ధైర్యవంతమైన నిర్ణయమని కరీనా కపూర్ చెప్పింది. ‘‘ప్రెగ్నెంట్ కావాలనుకోవడం ఆలియా తీసుకున్న గొప్ప, దైర్యవంతమైన నిర్ణయం. ఆమె కంటే పెద్ద స్లార్ నేడు ఎవరు లేరు. అయినప్పటికి తన సినిమా ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంటుంది. ఆలియా మా కుటుంబంలో భాగమని నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. ఆమె అద్భుతమైన నటి కావడంతోనే చెబుతున్నాను. ప్రెగెన్సీ అనంతరం కూడా అనేక ఉత్తమ చిత్రాల్లో ఆలియా నటిస్తుంది. జీవితంలోనే అందమైన అనుభవాన్ని ప్రస్తుతం ఆమె అనుభూతి చెందుతుంది. నేను ఆమెకు పెద్ద అభిమానిని’’ అని కరీనా చెప్పుకొచ్చింది. కరీనా కపూర్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చడ్డా’ లో నటించింది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ హీరోగా నటించాడు. నాగ చైతన్య కీలక పాత్ర పోషించాడు. టామ్ హ్యాంక్స్ నటించిన ‘ఫారెస్ట్ గంప్‌’ (Forrest Gump) కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కింది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నాడు. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.