Viral Video: కరీనా కపూర్‌ని భయపెట్టిన ఫ్యాన్.. ఆమె ముఖం ఎలా అయ్యిందో చూశారా?

ABN , First Publish Date - 2022-10-03T18:44:36+05:30 IST

బాలీవుడ్‌(Bollywood)లోని నటీమణుల్లో కరీనా కపూర్‌ (Kareena Kapoor)కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు...

Viral Video: కరీనా కపూర్‌ని భయపెట్టిన ఫ్యాన్.. ఆమె ముఖం ఎలా అయ్యిందో చూశారా?

బాలీవుడ్‌(Bollywood) నటీమణుల్లో కరీనా కపూర్‌ (Kareena Kapoor)కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లైన ఈ బ్యూటీ క్రేజ్ ఏ మాత్రం తగ్గక పోగా.. నానాటికీ పెరుగుతూ పోతోంది. ఈ బ్యూటీ తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంట పడింది. ఈ సందర్భంగా ఎంతోమంది అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అందులో.. ముంబై ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన కరీనా కారు దిగగానే కొందరూ ఫ్యాన్స్ నటి చుట్టూ గుమిగూడారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆ సమయంలో ఎంత ఇబ్బంది పడిన ఈ బ్యూటీ మాత్రం ఎలాంటి కోపాన్ని ప్రదర్శించకుండా కూల్‌గా ఉండటానికి ప్రయత్నించింది. అయితే.. సడెన్‌గా వచ్చిన ఒక ఫ్యాన్ సెల్ఫీ కోసం కరీనా మీద చేయి వేయడానికి ప్రయత్నించాడు. అది గమనించిన సెక్యూరిటీ గార్డు అతని చేయిని తీసేశాడు. అయితే.. ఆ ఫ్యాన్ యాక్షన్‌ని చూసిన కరీనా ఒక్కసారిగా భయపడింది. అది ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఆ వీడియో చూసిన పలువురు నెటిజన్లు.. ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ నటులను ఇబ్బంది పెడతారా అని కామెంట్స్ చేస్తున్నారు. ‘అతను ఆమెని భయపెట్టాడు. అలా ఎలా చేస్తారు’ అని ఒకరు.. ‘ఆ సమయంలో ఆమె రియాక్ట్ అయ్యి ఉంటే.. కరీనాని ట్రోల్ చేసేవారు కదా’ అంటూ రాసుకొస్తున్నారు.



Updated Date - 2022-10-03T18:44:36+05:30 IST