బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) తాజాగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా కరీనా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది. ‘షంషేరా’ (Shamshera) దారుణ పరాజయంపై కూడా మాట్లాడింది.
ఏ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించానని కరీనా కపూర్ చెప్పింది. ‘‘నేను ‘షంషేరా’ ను ఇంత వరకు చూడలేదు. ప్రతి ఒక్కరు వేర్వేరు పద్ధుతుల్లో పనిచేస్తుంటారు. ప్రతి చిత్రాన్ని ప్రత్యేకంగా చూస్తారు. కొందరు సినిమానే ప్రపంచంగా భావిస్తారు. మరికొందరు భావించలేరు. ప్రతి నటుడు, ప్రతి దర్శకుడు వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తారు. తమదైన శైలిలో తెరకెక్కిస్తారు. నాకు సంబంధించినంత వరకు నేను ఏ చిత్రంపై కామెంట్ చేయను’’ అని కరీనా కపూర్ పేర్కొంది. ‘షంషేరా’ లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటించాడు. వాణీ కపూర్ హీరోయిన్గా నటించింది. సంజయ్ దత్ విలన్ పాత్రను పోషించాడు. యశ్ రాజ్ ప్రొడక్షన్స్ రూ. 200కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించింది. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా జులై 27న ఈ సినిమా విడుదలయ్యింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయింది. సినిమా పూర్తి రన్లో కేవలం రూ. 40కోట్ల కలెక్షన్స్‌ను మాత్రమే కొల్లగొట్టింది. ఇక కరీనా నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ విషయానికి వస్తే ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ హీరోగా నటించాడు. నాగ చైతన్య, మోనాసింగ్ కీలక పాత్రలు పోషించారు. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ‘లాల్ సింగ్ చడ్డా’ పాన్ ఇండియాగా రూపొందింది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.