Laal Singh Chaddha: కరీనాను మళ్లీ పిలిచారు!

ABN , First Publish Date - 2021-09-13T01:32:45+05:30 IST

ఆమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘లాల్‌ సింగ్‌ చద్దా’. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుగుతోంది. కరీనా కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా? గతేడాది అక్టోబర్‌లో ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని ఇన్‌స్టాగ్రామ్‌లో కరీనా కపూర్‌ పేర్కొన్నారు.

Laal Singh Chaddha: కరీనాను మళ్లీ పిలిచారు!

ఆమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘లాల్‌ సింగ్‌ చద్దా’. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుగుతోంది. కరీనా కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా? గతేడాది అక్టోబర్‌లో ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని ఇన్‌స్టాగ్రామ్‌లో కరీనా కపూర్‌ పేర్కొన్నారు. కరోనా కాలంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణ చేశామన్నారు. అయితే, కరీనా సన్నివేశాలను రీషూట్‌ చేయాలనో? లేదంటే కరీనాపై కొత్త సన్నివేశాలను తెరకెక్కించాలనో? చిత్రబృందం భావించినట్టుంది. అందుకని, ఆమెను మళ్లీ సెట్స్‌కు పిలిచారు. ‘లాల్‌ సింగ్‌ చద్దా’ చిత్రీకరణ చేస్తున్నానని ఆదివారం కరీనా కపూర్‌ తెలిపారు. క్రిస్మస్‌కు ప్రేక్షకులకు ముందుకు చిత్రాన్ని తీసుకురానున్నారు. ఈ సినిమాతో అక్కినేని నాగచైతన్య హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. 




Updated Date - 2021-09-13T01:32:45+05:30 IST