నాన్న కంటే అమ్మ తక్కువ కాదనే విషయం పిల్లలకు అర్థమయ్యేలా చేస్తా: Kareena Kapoor

వివాహమై ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది కరీనా కపూర్. బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న కరీనా ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది. తైమూర్, జహంగీర్‌లను చూసుకుంటూనే సినిమా షూటింగ్‌లకు హాజరవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కరీనా మగ పిల్లల పెంపకం గురించి మాట్లాడింది. తన పిల్లలకు స్త్రీ విలువ తెలిసేలా పెంచుతానంటోంది. 


`నేను రెడీ అయి షూస్ వేసుకుంటున్న సమయంలో తైమూర్ వచ్చి.. `ఎక్కడికి వెళుతున్నావు` అని అడుగుతుంటాడు. షూటింగ్‌కు వెళుతున్నాను, మీటింగ్‌కు వెళుతున్నాను, ఈవెంట్‌కు వెళుతున్నాను.. అని చెబుతుంటాను. నాన్నతో సమానంగా అమ్మ కూడా పని చేస్తోందని వాడికి అర్థమైంది. మా ఇద్దరం కష్టపడి పిల్లలకు లోటు లేకుండా చూస్తున్నాం. అన్నింటిలోనూ సైఫ్‌కు, నాకు సగ భాగం ఉంది. మేం ఇద్దరం ఆర్థికంగా, భావోద్వేగపరంగా ఒకరిపై మరొకరం ఆధారపడతాం. అమ్మ కూడా నాన్నతో అన్ని విషయాల్లోనూ సమానమే అని అర్థమైతే మా పిల్లలు ఇంట్లో నన్ను గౌరవిస్తారు. బయటకు వెళ్లాక ప్రతి మహిళతోనూ మర్యాదగా ప్రవర్తిస్తారు. నాన్న కంటే అమ్మ ఏ విషయంలోనూ తక్కువ కాదు అని పిల్లలకు అర్థమయ్యేలా చేస్తే వారు మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తిస్తార`ని కరీనా చెప్పుకొచ్చింది.  

ఇవి కూడా చదవండిImage Caption

సైఫ్, కరీనాల చిన్న కొడుకు పేరు ‘జెహ్’... కన్ఫర్మ్ చేసిన రణధీర్ కపూర్!Alia Bhatt: ఒకటి కాదు రెండు కాదు.. RRR హీరోయిన్ నుంచి ఏకంగా మూడు తీపికబుర్లు..!

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.