అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘కరణ్ అర్జున్’
ABN , First Publish Date - 2022-05-19T23:33:08+05:30 IST
రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కరణ్ అర్జున్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. డా.సోమేశ్వరరావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్ నిర్మాతలు. ఈ చిత్రం ట్రైలర్‌ను అనిల్ రావిపూడి విడుదల చేశారు.
రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కరణ్ అర్జున్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. డా.సోమేశ్వరరావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్ నిర్మాతలు. ఈ చిత్రం ట్రైలర్‌ను అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. విజువల్స్ ప్రామిసింగ్‌గా ఉన్నాయి. యంగ్ టీమ్ ఎంతో రిస్క్ చేసి పాకిస్థాన్ సరిహద్దులు వరకూ వెళ్లి షూట్ చేశారు. సినిమా సక్సెస్ కావాలి’’ అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘మూడు పాత్రలతో రోడ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎంతో రిస్క్ చేసి షూటింగ్ చేశాం. ప్రతి సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా ఉంటూ థియేటర్‌లో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అని అన్నారు.