Karan Arjun: రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో డా.సోమేశ్వర రావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్ , రామకృష్ణ, క్రాంతి కిరణ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కరణ్ అర్జున్’. రవి మేకల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 24న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నద్ధమయ్యారు. ఈ సందర్బంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో మంగళవారం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa) మాట్లాడుతూ.. ‘‘మహాభారతంలోని కర్ణుడు, అర్జునుడి మధ్య ఉండే ఎమోషనల్ లైన్ తీసుకొని సాంకేతికంగా ఇప్పుడున్న జనరేషన్‌కు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని మలిచాము. మంచి లొకేషన్స్ కొరకు పాకిస్థాన్ బార్డర్లో ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ షూట్ చేశాం. ఇందులో ప్రతి సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఈ సినిమాని మూడు పాత్రలతో రోడ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. మొదట ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో మాత్రమే విడుదల చేయాలని అనుకున్నాం. కానీ సౌత్ రాష్టాలతో పాటు నార్త్‌లో కూడా మా సినిమాను ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం. నమ్మి సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది..’’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ.. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.