‘క‌నులు క‌నుల‌ను దోచాయంటే’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2020-02-28T23:15:40+05:30 IST

దుల్క‌ర్ స‌ల్మాన్‌.. మ‌ల‌యాళంలో స్టార్ హీరో. అయినా ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. తెలుగు ప్రేక్ష‌కుల విష‌యానికి వ‌స్తే `ఓకే బంగారం` సినిమాతో మ‌న‌కు కూడా ద‌గ్గ‌ర‌య్యారు.

‘క‌నులు క‌నుల‌ను దోచాయంటే’ మూవీ రివ్యూ

సంస్థ‌:  కె.ఎఫ్‌.సి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

బ్యాన‌ర్‌: వ‌యాకామ్‌ 18 స్టూడియోస్‌, ఆంటో జోసెఫ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ

న‌టీన‌టులు:  దుల్క‌ర్ స‌ల్మాన్‌, రీతూవ‌ర్మ‌, ర‌క్ష‌ణ్‌, నిరంజ‌ని, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ త‌దిత‌రులు

సంగీతం:  మ‌సాలా కేఫ్‌

కెమెరా:  కె.ఎం.భాస్క‌రన్‌

బీజీఎం:  హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌

ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ ఆంటోని

నిర్మాణం: వయోకామ్‌ 18 స్టూడియోస్‌, ఆంటో జోసెఫ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ

ద‌ర్శ‌క‌త్వం:  దేసింగ్ పెరియ‌సామి


దుల్క‌ర్ స‌ల్మాన్‌.. మ‌ల‌యాళంలో స్టార్ హీరో. అయినా ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. తెలుగు ప్రేక్ష‌కుల విష‌యానికి వ‌స్తే `ఓకే బంగారం` సినిమాతో మ‌న‌కు కూడా ద‌గ్గ‌ర‌య్యారు. ఈయ‌న రీతూవ‌ర్మ‌తో క‌లిసి న‌టించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘కణ్ణుమ్‌ కణ్ణుమ్ కొళ్లయడిత్తా’. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా విడుదలైంది. మ‌రి ఈ సినిమాతో దుల్క‌ర్ తెలుగులో మ‌రోసారి స‌క్సెస్ కొట్టాడా?  లేదా?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ముందుగా సినిమా క‌థ‌లోకి వెళ‌దాం..


క‌థ‌:

సిద్ధార్థ్‌(దుల్క‌ర్ స‌ల్మాన్‌), క‌ల్లిస్‌(ర‌క్ష‌ణ్‌) స‌ర‌దాగా జీవితం ఉండాల‌నుకునే వ్య‌క్తులు. అందుకోసం వీరు సుల‌భంగా డ‌బ్బు సంపాదించ‌డానికి దారుల‌ను వెతుకుతుంటారు. వీరిద్ద‌రి జీవితాల్లోకి మీరా(రీతూవ‌ర్మ‌), శ్రేయ‌(నిరంజ‌ని) రావ‌డంతో ఆలోచ‌న‌లు మారుతాయి. సిద్ధార్థ్ గోవాలో స్థిర‌ప‌డి కొత్త జీవితం మొద‌లు పెట్టాల‌నుకుంటాడు. న‌లుగురు క‌లిసి గోవా వెళ‌తారు. అక్క‌డ వీళ్ల జీవితాలు ఎలాంటి మ‌లుపు తీసుకుంటుంది? ఈ న‌లుగురికి, క‌మీష‌న‌ర్ ప్ర‌తాప్ సింహ‌(గౌత‌మ్ మీన‌న్‌)కి సంబంధం ఏంటి?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..


విశ్లేష‌ణ‌:

ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ కానీ దీనికి రొమాంటిక్ హంగులు అద్ది సినిమాను ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. సింగిల్‌లైన్‌లో చెప్పాలంటే ఆన్‌లైన్‌లో జ‌రిగే మోసాల‌ను ఆధారంగా చేసుకుని రాసుకున్న క‌థ‌. ఈ పాయింట్‌నే ట్రైల‌ర్‌లోనూ చెప్పారు. ప్ర‌థ‌మార్థం అంతా రొమాంటిక్‌గా సినిమా ప్రేక్ష‌కుల‌కు అనిపిస్తుది. కానీ నెమ్మ‌దిగా.. ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపులు తీసుకుంటుంది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌ని సీరియ‌స్ ఎలిమెంట్స్‌తో కాకుండా ల‌వ్ ఎలిమెంట్స్‌ను జోడించి చ‌క్క‌గా తెర‌కెక్కించారు. అస‌లు ఆన్‌లైన్ మోసాలు ఎలా జ‌రుగుతాయ‌నేది సినిమాలో చ‌క్క‌గా చూపించారు. దుల్క‌ర్ స‌ల్మాన్‌, రీతూవ‌ర్మ‌, ర‌క్ష‌ణ్‌, నిరంజ‌ని మ‌ధ్య స‌న్నివేశాలు, పాట‌లు అన్నింటితో ప్ర‌థ‌మార్థం ఆస‌క్తిక‌రంగా రొమాంటిక్‌గా అనిపిస్తుంది. అయితే క్ర‌మంగా పాత్ర‌ల‌కు అప్ప‌టి వ‌ర‌కు చూపించిన కోణాల‌కు మ‌రో కోణాల‌ను ద్వితీయార్థంలో చూపించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో దొంగ‌త‌నం సన్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. క్లైమాక్స్ ఇంకా గ్రిప్పింగ్‌గా తీసి ఉండొచ్చున‌నిపించింది.


దుల్క‌ర్ స‌ల్మాన్ చ‌క్క‌గా న‌టించాడు. ఇక దుల్క‌ర్‌, రీతూ మ‌ధ్య ప్రేమ సన్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. అయితే ఇంత‌కు ముందు చెప్పిన‌ట్లు ద్వితీయార్థంలో రీతూ పాత్ర‌లోని ట్విస్ట్ ప్రేక్ష‌కుల‌కు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. డైరెక్ట‌ర్ దేసింగ్ పెరియ‌సామి థ్రిల్ల‌ర్‌కు ల‌వ్ స్టోరిని క‌నెక్ట్ చేసి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. కొన్ని సీన్స్ గ్రిప్పింగ్‌గా లేవు. ముఖ్యంగా క్లైమాక్స్‌.


చివ‌ర‌గా.. క‌నులు క‌నుల‌ను దోచాయంటే.. ఆక‌ట్టుకునే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్

రేటింగ్‌: 2.75/5

Updated Date - 2020-02-28T23:15:40+05:30 IST