నానీ సొంత సినిమాలో కన్నడ హీరో ?

ABN , First Publish Date - 2021-09-24T17:02:24+05:30 IST

ప్రస్తుతం పరభాషా హీరోలు టాలీవుడ్ లో హీరోగా పాగా వేయడానికి చూస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ సూపర్ స్టార్స్ విజయ్, ధనుష్ టాలీవుడ్ లో తమ ఎంట్రీని ఫిక్స్ చేసుకోగా.. మరో ఇద్దరు హీరోలు త్వరలోనే తమ సినిమాల్ని కన్ఫామ్ చేయబోతున్నారు.

నానీ సొంత సినిమాలో కన్నడ హీరో ?

ప్రస్తుతం పరభాషా హీరోలు టాలీవుడ్ లో హీరోగా పాగా వేయడానికి చూస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ సూపర్ స్టార్స్ విజయ్, ధనుష్ టాలీవుడ్ లో తమ ఎంట్రీని ఫిక్స్ చేసుకోగా.. మరో ఇద్దరు హీరోలు త్వరలోనే తమ సినిమాల్ని కన్ఫామ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో అదర్ వుడ్ హీరో .. టాలీవుడ్ లో స్థిరపడే ప్రయత్నం చేస్తున్నాడు. అతడి పేరు దీక్షిత్ శెట్టి. ఇంతకు ముందు  ‘ముగ్గురు మొనగాళ్ళు’ అనే కామెడీ మూవీలో హీరోగా తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఆ సినిమా నిరాశ పరిచినప్పటికీ.. ఇప్పుడు  టాలీవుడ్ లో మరో  ఆఫర్ అందుకున్నట్టు సమాచారం. 



నేచురల్ స్టార్ నానీ తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై అతడి సోదరి దీప్తి ఘంటా ని దర్శకురాలిగా పరిచయం చేస్తూ ప్రశాంతి త్రిపురనేని తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మీట్ క్యూట్’. ఈ సినిమాలో హీరోగా దీక్షిత్ శెట్టిని ఎంపిక చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇందులో అతడి సరసన ఆకాంక్షా సింగ్ కథానాయికగా నటిస్తోందని తెలుస్తోంది. ఆంథాలజీ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో దీక్షిత్, ఆకాంక్ష ఎపిసోడ్ హార్ట్ టచింగ్ గా ఉంటుందట. ఇంకా వివిధ భాషలకు చెందిన ఆరుగురు నటీనటులు ఇందులో నటిస్తున్నారు.  మొత్తం 5 కథలతో కూడిన ఈ సినిమాలో సత్యరాజ్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలో విడుదల కానుంది. 

Updated Date - 2021-09-24T17:02:24+05:30 IST