కొవ్వు కరిగించే ఆపరేషన్‌ వికటించి కన్నడ నటి మృతి

ABN , First Publish Date - 2022-05-18T05:50:23+05:30 IST

కొవ్వు కరిగించుకునేందుకు ఫ్యాట్‌ సర్జరీ చేయించుకుంది. అది వికటించి, శ్వాసకోస సమస్యలకు దారితీసింది. దీంతో కన్నడ యువనటి చేతనారాజ్‌...

కొవ్వు కరిగించే ఆపరేషన్‌ వికటించి కన్నడ నటి మృతి

కొవ్వు కరిగించుకునేందుకు ఫ్యాట్‌ సర్జరీ చేయించుకుంది. అది వికటించి, శ్వాసకోస సమస్యలకు దారితీసింది. దీంతో కన్నడ యువనటి చేతనారాజ్‌ (21) సోమవారం రాత్రి మృతి చెందారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. సుబ్రహ్మణ్య నగర్‌ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసును నమోదు చేసి విచారణ చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమార్తెను పొట్టనబెట్టుకుందని చేతనారాజ్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఫ్యాట్‌ సర్జరీ కోసం ఆమె బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో అడ్మిట్‌ అయ్యారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులెవరికీ చెప్పలేదు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడంతో పరిస్థితి విషమంగా మారింది. వైద్యుల సూచన మేరకు శంకరమఠంలోని కార్డే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చేతన మృతి చెందారు. పలు టీవీ సీరియల్స్‌లోనూ, సినిమాల్లోనూ చేతన నటించారు. తమ అనుమతి లేకుండా సర్జరీ ఎలా చేస్తారని ఆసుపత్రి వైద్యులను చేతన కుటుంబసభ్యులు ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని వైద్యులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఆంధ్రజ్యోతి, బెంగళూరు 


Updated Date - 2022-05-18T05:50:23+05:30 IST