తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితగా కంగనా రనౌత్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘తలైవి’. ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా రెండో దశతో వాయిదా పడింది. త్వరలోనే ప్రేక్షకుల మందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తలైవి నుంచి కొత్త ప్రచార చిత్రాలను చిత్రబృందం విడుదలచేసింది. అందులో కంగనా రనౌత్ విభిన్న అవతారాల్లో కనిపించి ఆకట్టుకున్నారు. సినిమా హీరోయిన్గా, రాజకీయ నాయకురాలిగా కంగనా రనౌత్ కనిపించారు. కొంగును భుజాల నిండుగా కప్పుకొని విజయ సంకేతం చూపుతూ, ఇందిరా గాంధీని కలిసిన సందర్భంలో, ఎంజీఆర్ సరసన స్టెప్పులేస్తూ, ఆయనకు అభివాదం చేస్తూ విభిన్న గెటప్పుల్లో కంగనా కనిపించారు. ఈ చిత్రంలో అరవిందస్వామి ఎంజీఆర్‌గా నటించారు. విజయేంద్రప్రసాద్ కథను అందించారు. ఎ.ఎల్. విజయ్ దర్శకుడు.