చారిత్రక నేపథ్యంలో కంచుకోట

ABN , First Publish Date - 2022-05-18T05:48:06+05:30 IST

టీఎఫ్‌సీసీ ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌ ముఖ్యపాత్రలో నటిస్తూ, నిర్మిస్తోన్న చిత్రం ‘కంచుకోట’. రహస్యం అనేది ఉపశీర్షిక....

చారిత్రక నేపథ్యంలో కంచుకోట

టీఎఫ్‌సీసీ ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌ ముఖ్యపాత్రలో నటిస్తూ, నిర్మిస్తోన్న చిత్రం ‘కంచుకోట’. రహస్యం అనేది ఉపశీర్షిక. హీరో రాజశేఖర్‌ మేనల్లుడు మదన్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. ఆశ, దివ్య హీరోయిన్లు. ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. మంగళవారం ప్రతాని రామకృష్ణ గౌడ్‌ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘చారిత్రక నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. సినిమాకు గ్రాఫిక్స్‌ ప్రధానాకర్షణ. నేను గురూజీ పాత్రను పోషించాను. జూన్‌లో సినిమాను విడుదల చేస్తాం’ అన్నారు.  ఎన్టీఆర్‌ నటించిన ‘కంచుకోట’ స్థాయిలో ఈ సినిమా కూడా భారీ విజయం అందుకోవాలని తెలుగు ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్రటరీ మోహన్‌ వడపట్ల ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత గురురాజ్‌, హీరోయిన్లు ఆశ, దివ్య కూడా పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T05:48:06+05:30 IST