అంధుడిగా కమల్‌ ?

ABN , First Publish Date - 2021-07-21T09:44:27+05:30 IST

లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘విక్రమ్‌’. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఇటీవలె చిత్రీకరణ తిరిగి ప్రారంభించారు...

అంధుడిగా కమల్‌ ?

లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘విక్రమ్‌’. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఇటీవలె చిత్రీకరణ తిరిగి ప్రారంభించారు. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ విలన్‌ పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన, విలక్షణమైన పాత్రల్లో మెప్పించే అలవాటు ఉన్న కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’లోనూ సర్ర్పైజ్‌ ఇవ్వనున్నారని కోలీవుడ్‌ టాక్‌. ఈ సినిమా కొంతభాగంలో ఆయన కథానుసారం అంధుడిగా కనిపించనున్నారట. 1981లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమావాస్య చంద్రుడు’ చిత్రంలో కమల్‌హాసన్‌ అంధుడైన వయోలిన్‌ వాద్యకారుడి పాత్రలో నటించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన ‘విక్రమ్‌’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో అంధుడిగా కనిపించనున్నారు. కంటిచూపు లేని వ్యక్తిగా విలన్లను సమర్థవంతంగా ఎదుర్కొనే సన్నివేశాలు సినిమాకు అదనపు బలం అని చెపుతున్నారు. ఈ ఘట్టాలు సినిమాకు హైలెట్‌ అయ్యేలా లోకేశ్‌ కనగరాజ్‌ బలమైన స్ర్కిప్ట్‌ రాశారట. 


Updated Date - 2021-07-21T09:44:27+05:30 IST