Vikram: 100ఏళ్ల కోలీవుడ్ ఇండస్ట్రీలోనే సంచలనం

ABN , First Publish Date - 2022-09-23T01:53:25+05:30 IST

విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన సినిమా ‘విక్రమ్’ (Vikram). లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియాగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న

Vikram: 100ఏళ్ల కోలీవుడ్ ఇండస్ట్రీలోనే సంచలనం

విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన సినిమా ‘విక్రమ్’ (Vikram). లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియాగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న పలు భాషల్లో విడుదల అయింది. ఈ చిత్రం విడుదలైన నాటి నుంచి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దుసుకుపోతుంది. భారీ వసూళ్లను రాబట్టింది. కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 


‘విక్రమ్’ థియేట్రికల్ రన్‌ పూర్తయింది. ఈ సినిమా థియేటర్‌లో 113రోజులు నడిచింది. ‘విక్రమ్’ తమిళనాడులోనే ఆల్‌టైం హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అత్యధిక షేర్‌ను వసూలు చేసిన సినిమాగా రికార్డును కొల్లగొట్టింది. 100ఏళ్ల కోలీవుడ్ చరిత్రలోనే అత్యధిక మంది వీక్షించిన తమిళ సినిమాగా చరిత్ర సృష్టించింది. వరల్డ్ వైడ్‌గా రూ. 500కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ‘విక్రమ్’లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) కీలక పాత్రలు పోషించారు. రోలెక్స్ అనే అతిథి పాత్రలో సూర్య తళుక్కున మెరిశాడు. ఈ సినిమా ఓవర్సీస్‌లో రెండు మిలియన్ డాలర్స్‌ కలెక్షన్స్‌ను కొల్లగొట్టడం విశేషం. ‘విక్రమ్’ కు పోటీగా అదే రోజున ‘మేజర్’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురయినప్పటికి ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించడం చెప్పుకోదగ్గ విశేషం. ‘విక్రమ్’ ను లోకేశ్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌గా తెరకెక్కించాడు. గతంలో తాను దర్శకత్వం వహించిన ‘ఖైదీ’ తో లింక్ పెట్టాడు. విక్రమ్ క్లైమాక్స్‌లో భాగంగా ఓ సన్నివేశంలో కార్తి వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఫలితంగా లోకేశ్ దర్శకత్వం వహించబోయే తదుపరి సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. విజయ్‌తో తన ప్రాజెక్టును లోకేశ్ ఇప్పటికే ప్రకటించాడు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో కథ రాసుకున్నాడు. సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే ఈ సినిమాను రూపొందిస్తున్నాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం విడుదల వరకు వేచి చూడాల్సిందే. ‘విక్రమ్’ ఇచ్చిన కిక్‌తో కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. సెప్టెంబర్ 22న ఆ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టాడు. 



Updated Date - 2022-09-23T01:53:25+05:30 IST