Kamal Haasan: ఇప్పుడు నన్ను.. తర్వాత విజయ్‌ని.. ఇదే సినిమా చక్రం

ABN , First Publish Date - 2022-11-28T15:45:20+05:30 IST

ఈ తరంలోని అనేక మంది నటీనటులను ఆశ్చర్యంగా చూస్తున్నాను. వాళ్ళలాగే నేను కూడా ఏదో సాధించాలని తపన పడుతున్నాను. ఇపుడు వీరంతా నన్ను

Kamal Haasan: ఇప్పుడు నన్ను.. తర్వాత విజయ్‌ని.. ఇదే సినిమా చక్రం

విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi)కి సినిమాపై ఉన్న అపారమైన ప్రేమను చూసి ఈ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌కు  వచ్చానని విశ్వనటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) పేర్కొన్నారు. పొన్‌రాం (Ponram) దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి, అనుకీర్తి జంటగా నటించిన చిత్రం ‘డీఎస్పీ’ (DSP). స్టోన్‌ బెంచ్‌ ఫిలిమ్స్‌ సమర్పణలో కార్తికేయన్‌ సంతానం (Kaarthekeyen Santhanam) నిర్మించారు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ రిలీజ్‌ నందంబాక్కంలోని చెన్నై ట్రేడ్‌ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ తరంలోని అనేక మంది నటీనటులను ఆశ్చర్యంగా చూస్తున్నాను. వాళ్ళలాగే నేను కూడా ఏదో సాధించాలని తపన పడుతున్నాను. ఇపుడు వీరంతా నన్ను స్ఫూర్తిగా తీసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. రేపటి రోజున విజయ్‌ సేతుపతి విజయాలను మెచ్చుకునే నటీనటులు వస్తారు. అదే ఈ సినిమా చక్రం. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని తెలిపారు.  (Kamal Haasan about Vijay Sethupathi)




విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ.. నాకు కమర్షియల్‌ చిత్రాలు చేసే అలవాటు లేదు. దర్శకుడు పొన్‌రాంతో చిత్రం చేస్తానని కలలో కూడా ఊహించలేదు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో అంగీకరించాను. ఈ వేడుకకు కమల్‌ సార్ వస్తారని ఊహించలేదు. సినీ రంగంలో వినూత్నమైన అంశాలకు ఆయనే గొప్ప స్ఫూర్తి. రాబోయే తరాలు కూడా ఆయనని గుర్తు చేసుకుంటారు.. అని పేర్కొన్నారు. దర్శకుడు పొన్‌రాం (Director Ponram) మాట్లాడుతూ.. విజయ్‌ సేతుపతి ఒక మంచి నటుడే కాదు.. మంచి మానవతావాది. ఆయన వల్లే ఈ చిత్రం సాధ్యమైంది. భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా హీరోయిన్‌ అనుకీర్తి, నిర్మాత కార్తికేయన్‌ సంతానం, దర్శకుడు మిష్కిన్‌ తదితరులు ప్రసంగించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 2న విడుదల చేస్తున్నారు. (DSP Movie Audio and Trailer Launch Event)

Updated Date - 2022-11-28T15:45:20+05:30 IST