Aryan Khan డ్రగ్స్ కేసుతో భయం.. వాళ్లంతా భారత్ నుంచి వెళ్లిపోదామనుకుంటున్నారంటూ సంచలన కామెంట్స్

ముంబై తీరంలోని ఈ నెల రెండో తేదీన ఓ క్రూయిజ్ షిప్‌పై దాడి చేసి బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ అరెస్ట్‌తో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు షారూక్‌కు మద్దతుగా నిలిచారు. మిగతా వారిని వదిలేసి ఆర్యన్‌నే టార్గెట్ చేయడంపై విమర్శలు చేస్తున్నారు. బాలీవుడ్ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ కూడా తాజాగా ఈ ఉదంతంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 


`చాలా మంది స్టార్ కిడ్స్ ఈ దేశాన్ని వదిలి పోవాలని అనుకుంటున్నారు. షారూక్ కొడుకుకే ఇలా జరిగిందంటే.. భవిష్యత్తులో తమకూ అదే గతి పడుతుందని భయపడుతున్నారు` అంటూ కమాల్ సంచలన ట్వీట్ చేశాడు. అంతకు ముందు కూడా కమాల్ షారూక్‌కు మద్దతుగా ట్వీట్ చేశాడు. `అబద్దపు ఆరోపణలతో షారూక్‌ను ఇబ్బంది పెట్టాలని ఎవరైనా అనుకుంటే.. నేను బేషరతుగా షారూక్‌కు మద్దతుగా నిలుస్తాన`ని ట్వీట్ చేశాడు.  


ఇవి కూడా చదవండిImage Caption

ఈడీ విచారణకు హాజరుకానున్న పూరి జగన్నాథ్యాక్షన్ సీన్ల కోసం ఓ వ్యక్తి నుంచి సలహాలు తీసుకుంటున్న Shah Rukh Khan.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే..Alia Bhatt: ఒకటి కాదు రెండు కాదు.. RRR హీరోయిన్ నుంచి ఏకంగా మూడు తీపికబుర్లు..!ఈ ఫొటోల్లోని ఇద్దరూ వేర్వేరు కాదు.. ఒక్కరే.. డబ్బుంటే అందాన్ని కూడా మార్చొచ్చంటూ ఆ నటిపై ట్రోల్స్

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.