Bimbisara సక్సెస్‌తో.. నాకు మ‌ళ్లీ జ‌న్మించిన‌ట్లుంది: క‌ళ్యాణ్ రామ్‌

ABN , First Publish Date - 2022-08-09T03:15:40+05:30 IST

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ (Nandamuri KalyanRam), కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara). ఎన్టీఆర్ ఆర్ట్స్ (NTR Arts) బ్యానర్‌పై

Bimbisara సక్సెస్‌తో.. నాకు మ‌ళ్లీ జ‌న్మించిన‌ట్లుంది: క‌ళ్యాణ్ రామ్‌

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ (Nandamuri KalyanRam), కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara). ఎన్టీఆర్ ఆర్ట్స్ (NTR Arts) బ్యానర్‌పై వ‌శిష్ట (Vashista) దర్శక‌త్వంలో హ‌రికృష్ణ.కె (Harikrishna K) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 5న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్టర్ విజ‌యాన్ని సాధించింది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం చిత్రయూనిట్ స‌క్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, దిల్‌రాజు, ద‌ర్శకుడు వ‌శిష్ట, సినిమాటోగ్రాఫ‌ర్ ఛోటా కె.నాయుడు, ఈస్ట్ గోదావ‌రి డిస్ట్రిబ్యూట‌ర్ శివ‌రాం, వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ఎల్‌.వి.ఆర్, నెల్లూరు డిస్ట్రిబ్యూట‌ర్ హ‌రి, గుంటూరు డిస్ట్రిబ్యూట‌ర్ ఎ.ఎం.ఆర్‌, బేబి శ్రీదేవి త‌దిత‌రులు పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో హీరో నంద‌మూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘2020 మార్చిలో ఈ సినిమాను స్టార్ట్ చేశాం. కొన్ని రోజుల‌కే కరోనా మహహ్మారి కార‌ణంగా లాక్ డౌన్ చేశారు. అది ఏకంగా మూడున్నల నెల‌ల పాటు కొన‌సాగింది. దీంతో తెలియ‌ని టెన్షన్ మొద‌లైంది. త‌ర్వాత మ‌ళ్లీ షూటింగ్ మొదలుపెట్టాం. మ‌ళ్లీ సెకండ్ వేవ్ వచ్చి.. లాక్ డౌన్ చేశారు. నేనైతే నెర్వస్ ఫీల‌య్యాను. నాకైతే కొత్త జోన‌ర్‌. విజువ‌ల్స్ మీద కాన్‌స‌న్‌ట్రేట్ చేసి పెద్ద సినిమా చేస్తున్నాం. ఏమ‌వుతుందోన‌ని టెన్షన్‌లో ఉన్నాను. ల‌క్కీగా అన్నీ ఓపెన్ అయ్యాయి. సినిమా పూర్తయ్యింది. ఇక  మే ఎండింగ్‌, జూన్ నెల‌ల్లో మరో టెన్షన్. జ‌నాలు థియేట‌ర్‌కు రావ‌టం లేద‌ని మొద‌లు పెట్టారు. మ‌ళ్లీ టెన్షన్ మొద‌లైంది. ఎంతో న‌మ్మకంతో సినిమాను పూర్తి చేశాం. కానీ కొంత మంది మాట్లాడే మాట‌లు వింటే భ‌య‌మేసేది. అయితే మంచి కంటెంట్‌తో సినిమాను తీసి ప్రేక్షకుల ముందు పెడితే వాళ్లు బ్రహ్మర‌థం ప‌డ‌తార‌ని న‌మ్మాను. అదే నిజ‌మైంది. ట్రైల‌ర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. మా నంద‌మూరి వీరాభిమానుల‌కు థ్యాంక్స్‌. కీర‌వాణిగారు త‌న బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాకు ప్రాణం పోశారు. మా ఛోటా కె.నాయుడుగారు న‌న్ను భ‌రించారు. అలాగే మా టెక్నీషియ‌న్స్‌కి చాలా థ్యాంక్స్‌. సినిమా రిలీజ్ త‌ర్వాత చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకు మ‌ళ్లీ జ‌న్మించిన‌ట్లు అనిపించింది. ఇంత మంచి క‌థ‌ను నాకు ఇచ్చిన వ‌శిష్టకు ధ‌న్యవాదాలు. సినిమాను చూసి న‌మ్మి డిస్ట్రిబ్యూట్ చేసిన మా దిల్‌రాజుగారికి, శిరీష్‌గారికి, అలాగే మా డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు థ్యాంక్స్‌. నేను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తద‌న‌ముంటూనే ప్రేక్షకులంద‌రికీ న‌చ్చేలా ప్రయత్నిస్తాను. ఈ సినిమాను ఆద‌రించిన ప్రేక్షకుల‌కు చేతులెత్తి న‌మ‌స్కరిస్తున్నాను..’’ అని తెలిపారు. (Bimbisara Success Meet)



Updated Date - 2022-08-09T03:15:40+05:30 IST