వైవిధ్యమైన సినిమాలు చేయడానికి ఆసక్తి చూపే హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. ప్రస్తుతం ఈయన ‘బింబిసార’ అనే హిస్టారికల్ ఫాంటసీ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా ఇప్పటి వరకు తాను చేయని ఓ జోనర్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకెళ్తే.. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మించబోయే స్పై థ్రిల్లర్లో నటించడానికి ఈ నందమూరి హీరో ఓకే చెప్పాడు. నవీన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రం 1950 బ్యాక్డ్రాప్లో తెరకెక్కనుందట. మరి రెట్రో స్పైగా కళ్యాణ్ రామ్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి మరి.