Kalyan Ram: 'బింబిసారా' రిలీజ్ డేట్ వచ్చేసింది..

ABN , First Publish Date - 2022-04-02T18:10:22+05:30 IST

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'బింబిసారా'. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. హీరోగా - నిర్మాతగా రెండు పడవల ప్రయాణం సాగిస్తున్న కళ్యాణ్ రామ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం

Kalyan Ram: 'బింబిసారా' రిలీజ్ డేట్ వచ్చేసింది..

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'బింబిసారా'. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. హీరోగా - నిర్మాతగా రెండు పడవల ప్రయాణం సాగిస్తున్న కళ్యాణ్ రామ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఓ వైపు కమర్షియల్  సినిమాలు చేస్తూనే మరో వైపు ప్రయోగాత్మక సినిమాలనూ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హిస్టారికల్ మూవీలో నటిస్తున్నారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి అయిన బింబిసారుడు కథతో 'బింబిసారా' రూపొందుతోంది.


ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఉగాది పండుగ సందర్భంగా నేడు కళాణ్ రామ్ పోస్టర్‌ను వదిలి శుభాకాంక్షలు తెలుపుతూ అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీలో కళ్యాణ్ రామ్ రెండు పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించబోతున్నారు. కేథరీన్, సంయుక్త మీనన్, వారినా హుసేన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీత దర్శకుడు. 

Updated Date - 2022-04-02T18:10:22+05:30 IST