Ollywood: ఒలీవుడ్‌లో చాలా మంది డ్రగ్స్‌కు అలవాటు పడ్డారంటున్న కళింగ సేన

Twitter IconWatsapp IconFacebook Icon
Ollywood: ఒలీవుడ్‌లో చాలా మంది డ్రగ్స్‌కు అలవాటు పడ్డారంటున్న కళింగ సేన

బాలీవుడ్ మాదిరిగానే ఒలీవుడ్ (Ollywood)(ఒడిషా ఫిలిం ఇండస్ట్రీ) లోను చాలా మంది నటులు, నిర్మాతలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని ద కళింగ సేన ఆరోపించింది. రేవ్ పార్టీలు చేసుకుంటున్నారని చెప్పింది. డ్రగ్ డీల్స్‌కు ఒలీవుడ్‌లోని వారు మినహాయింపు ఏం కాదని పేర్కొంది. డ్రగ్స్ అంశాన్ని ప్రస్తావిస్తూ ద కళింగ సేన చీఫ్ హేమంత రథ్ (Hemanta Rath) ఖరాబేలా నగర్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశాడు.   


ఒడియా సినీ ఇండస్ట్రీలోని కొంత మంది మాదక ద్రవ్యాల ఉచ్చులో చిక్కుకున్నారని హేమంత ఆరోపించాడు. బాలీవుడ్ మాదిరిగానే ఇతర సినీ ఇండస్ట్రీ‌లకు చెందిన వ్యక్తులు డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిపాడు. ‘‘సుశాంత్ సింగ్ డ్రగ్స్ తీసుకుని మానసిక సమతుల్యతను కోల్పోయి, ఆత్మహత్య చేసుకోవడాన్ని మనం చూశాం. ఒడిషాలో గంజాయి తీవ్రతపై సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఇప్పటికే స్టేట్‌మెంట్ ఇచ్చింది. కొంత మంది తన భర్తకు డ్రగ్స్‌ను అలవాటు చేశారని బాబుషాన్ (Babushaan) భార్య చెప్పింది. ఈ మాదక ద్రవ్యాల వల్లే బాబుషాన్ మానసిక సమతుల్యతను కోల్పోయాడని అతడి తల్లి స్పష్టం చేసింది. ముంబై‌లో సుశాంత్ సింగ్ మాదిరిగా మన ఇండస్ట్రీలో ఎవరు ఆత్మహత్య చేసుకోరని మేం ఆశిస్తున్నాం. నార్కొటిక్స్ డీల్స్‌కు సంబంధించిన అంశాలను సిరీయస్‌గా తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం. డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదార్లను దర్యాప్తు చేయాలని కోరుతున్నాం’’ అని హేమంత రథ్ పేర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం బాబుషాన్ భార్య తృప్తి సత్పత్తి (Trupti Satpathy) అతడికీ వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సెక్షన్ 498ఏ కింద కేసును నమోదు చేశారు. ఈ కేసులో అతడు ముందస్తు బెయిల్ కోరుతూ ఒరిస్సా హై కోర్టును ఆశ్రయించాడు.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.