కాలినడక షికారు

కంగనా రనౌత్‌ ప్రస్తుతం హంగేరిలో ‘ధాకడ్‌’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం కావడంతో ఆమె యాక్షన్‌ సీక్వెన్స్‌ ట్రైనింగ్‌లో పాల్గొంటున్నారు. ఆ అలసటను లెక్కచేయకుండా నేరుగా జిమ్‌ నుంచి సరదాగా అలా బయటకు కాలినడక షికారుకు వెళ్లారు. అలా బుడాపెస్ట్‌ నగరంలో కొన్ని ప్రసిద్ధ ప్రదేశాలను కంగన చుట్టొచ్చారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. కంగనా రనౌత్‌ నటించిన ‘తలైవి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘తేజస్‌’, ‘ఎమర్జెన్సీ’ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. 


Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.