Movie Review: Kalapuram (కళాపురం)

ABN , First Publish Date - 2022-08-26T22:05:51+05:30 IST

దర్శకుడు కరుణ కుమార్‌ తన మొదటి సినిమా ‘పలాస 1978’ అనే సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడున్న సినిమాలకి భిన్నంగా శ్రీకాకుళం దగ్గర ఒక గ్రామంలో జరిగే కథను ఎంచుకొని ఆ కథని వాస్తవానికి దగ్గరగా వుండేటట్టు చూపించటంలో సఫలీకృతం అయ్యాడు. రెండో సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ రీమేక్‌ ఎంచుకున్నాడు, కానీ అది అంతగా నడవలేదు. ఇప్పుడు ‘కళాపురం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

Movie Review: Kalapuram (కళాపురం)

Movie Review: Kalapuram (కళాపురం)

విడుదల తేది: 26–08–2022

నటీనటులు: సత్యం రాజేష్‌(Satyam rajesh), సంచిత, కాషిమ రఫీ, చిత్రం శ్రీను, ప్రవీణ్‌

సంగీతం: మణిశర్మ 

రచన–దర్శకత్వం: కరుణ కుమార్‌

నిర్మాత: రజిని తాళ్లూరి

రేటింగ్‌:


సురేష్‌ కవిరాయని


దర్శకుడు కరుణ కుమార్‌ తన మొదటి సినిమా ‘పలాస 1978’ అనే సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడున్న సినిమాలకి భిన్నంగా శ్రీకాకుళం దగ్గర ఒక గ్రామంలో జరిగే కథను ఎంచుకొని ఆ కథని వాస్తవానికి దగ్గరగా వుండేటట్టు చూపించటంలో సఫలీకృతం అయ్యాడు. రెండో సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ రీమేక్‌ ఎంచుకున్నాడు, కానీ అది అంతగా నడవలేదు. ఇప్పుడు ‘కళాపురం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇది ఫిక్షన్‌ కథ అయినా కొంచెం వాస్తవికతకు దగ్గరగా ఉండేట్టు తీసినట్లు ప్రచారాల్లో చెప్పాడు. ఈ చిన్న సినిమాకి పెద్ద సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించటం విశేషం. రజిని తాళ్లూరి నిర్మాత. దర్శకత్వంతో పాటు కరుణ కుమార్‌ దీనికి కథ, రచన, స్ర్కీన్‌ప్లే అందించారు. సత్యం రాజేష్‌ ఇందులో కథ నాయకుడిగా నటించాడు. (Kalapuram movie review)


కథ: 

కుమార్‌ (సత్యం రాజేష్‌) ఒక మంచి సినిమా దర్శకుడు కావాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతను తన  ేస్నహితుడు ప్రవీణ్‌ (ప్రవీణ్‌ యండమూరి)తో కలిసుంటాడు. ప్రవీణ్‌ కూడా యాక్టర్‌ కావాలని తపన పడుతుంటాడు. మరోపక్క కుమార్‌కి ఇందు (కాశిమా రఫి) అనే ప్రియురాలు ఉంటుంది. ఆమె కూడా సినిమాల్లో కథానాయకి పాత్ర కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నం భాగంగా ఆమె కొంచెం పక్కదారి పడుతుంది, అది కుమార్‌కి నచ్చక ఆమెని వదిలేసి ఉద్యోగం చేసి సెటిల్‌ అవుదామని ఫ్రెండ్‌కి చెబుతాడు. అదే సమయంలో అప్పారావు (జనార్ధన్‌) అనే నిర్మాత వీళ్ళకి తారసపడి కుమార్‌తో తాను నిర్మాతగా సినిమా తీయడానికి ముందుకు వస్తానంటాడు. కానీ కొంత షూటింగ్‌ తన స్వగ్రామం అయిన కళాపురంలో తీయాలి అని షరతు పెట్టడం వల్ల కుమార్‌ అతని స్నేహితుడు ప్రవీణ్‌ కళాపురం చేరుకుంటారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఎందుకు కళాపురంలోనే షూటింగ్‌ చెయ్యమన్నాడు, అసలు వాళ్ళు సినిమా తీసారా? దీని వెనక ఇంకేమమైనా రహస్యం వుందా, అక్కడ కుమార్‌కి ఎవరు పరిచయం అయ్యారు, ఇవన్నీ వెండి తెరపై చూడాల్సిందే! 



విశ్లేషణ:

కరుణ కుమార్‌ ఈసారి కొంచెం వ్యంగంగా (సెటైరికల్‌) ఉండే స్టోరీని ఎంచుకున్నాడు. సినిమా ఇండస్ర్టీలో ఉండే కష్టాలు, కాస్టింగ్‌ కౌచ్‌ లాంటివి కథలో చూపించాడు. అయితే ఎక్కడ ఎవరికీ హాని కలిగించకుండా,  ఎక్స్‌పోజింగ్‌ లేకుండా చూపించాడు. ఆలా కథని చూపిస్తూనే చిన్న వినోదాన్ని పంచాడు. ఇలాంటివి ఇంతకు ముందు చాలా సినిమాల్లో వచ్చినా కూడా, కరుణ కుమార్‌ కొంచెం వాస్తవికతకు దగ్గరగా వుండే విధంగా చూపించాడు. ఆ లొకేషన్స్‌, యాక్టర్స్‌ నుంచి సహజమైన నటనను రాబట్టుకోగలగడంలో సఫలమయ్యాడు. చివర అరగంట సినిమా అయితే నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ట్విస్ట్‌ ఆకట్టుకునేలా ఉంది. కరుణ కుమార్‌ తన కథను రాజకీయాలకు ముడిపెట్టిన విధానం బావుంటుంది. (Kalapuram movie review)

సాంకేతికపరంగా చూస్తే మణి శర్మ సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. చాలా రోజుల తరువాత బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంది అనేట్టు మణిశర్మ ఇచ్చారు. ఆయన సీనియారిటీ సినిమాకు ఉపయోగపడింది. గ్రామీణ వాతావరణం, లొకేషన్స్‌ ఆకట్టుకునేలా చిత్రీకరించారు సినిమాటోగ్రాఫర్‌. నటీనటుల విషయానికి వస్తే సత్యం రాజేష్‌ అందరికీ హాస్యనటుడిగా పరిచయం. కానీ చాలా గ్యాప్‌ తర్వాత ఈ సినిమాలో కథానాయకుడిగా కనిపించాడు. తన నటన సినిమాకు ఎసెట్‌ అయింది. అతనిలోని నటుణ్ణి పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చాడు. ఈ సినిమాకు అతనికి మంచి టర్నింగ్‌ పాయింట్‌ కావచ్చు. రాజేశ్‌ స్నేహితుడిగా ప్రవీణ్‌ కూడా బాగా చేశాడు. కాషిమా రఫీ ఇందుగా మెప్పించింది. సంచిత అందంగా కనిపించింది, బాగా నటించింది కూడా. చిత్రం శీను సెకండ్‌ హాఫ్‌లో కనిపిస్తాడు. జనార్దన్‌ అనే అతను నిర్మాత అప్పారావుగా కనిపిస్తాడు. కొత్త ఆర్టిస్ట్‌ అయినా పాత్రకు సరిపడేలా యాక్ట్‌ చేశాడు. కరుణకుమార్‌ ఇంతకు ముందు సినిమాల్లోలానే ఇందులో కూడా ఇద్దరు ముగ్గురు ఆర్టిస్ట్స్‌ని పరిచయం చేసాడు. వారంతా నటనతో నిరూపించుకున్నారు. కరుణ కుమార్‌ కథ విషయంలో ఇంకొంచెం దృష్టి సారించి ఉంటే ఇంకా బాగా ఉండేది అనిపించింది. కానీ మొత్తం మీద ఒక ఇంటరెస్టింగ్‌ సినిమానే తీసాడు. ఎక్కడ బోర్‌ కొట్టదు, లైట్‌ కామెడీతో సాగే ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. (Kalapuram movie review)


ట్యాగ్‌లైన్‌: వాస్తవికతకు దగ్గర ఉండే ‘కళాపురం’. 


Updated Date - 2022-08-26T22:05:51+05:30 IST