ప్రియాంక న్యూయార్క్ రెస్టారెంట్... అతిథిగా హాలీవుడ్ నటుడు!

ABN , First Publish Date - 2021-10-11T22:54:31+05:30 IST

మన దేసీగాళ్ ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ స్టార్. అమెరికా, లండన్, ఇండియా మధ్య చక్కర్లు కొడుతోంది. అయితే, ఆమె ఓ హోటల్ కూడా నడుపుతోంది.

ప్రియాంక న్యూయార్క్ రెస్టారెంట్... అతిథిగా హాలీవుడ్ నటుడు!

మన దేసీగాళ్ ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ స్టార్. అమెరికా, లండన్, ఇండియా మధ్య చక్కర్లు కొడుతోంది. అయితే, ఆమె ఓ హోటల్ కూడా నడుపుతోంది. ఏదో చిన్న సైజు రెస్టారెంట్ అనుకోకండి. న్యూయార్క్ లాంటి కాస్ట్‌లీ అమెరికన్ సిటీలో, ప్రియాంక ‘సోనా’ అనే పోష్ ఫుడ్ సెంటర్, రన్ చేస్తోంది.


న్యూయార్క్‌లోని ‘సోనా’ రెస్టారెంట్ హాలీవుడ్ వీఐపీలకు కూడా ఫేవరెట్. అప్పుడప్పుడూ లాస్ ఏంజిలిస్ నుంచీ న్యూయార్క్ వచ్చి ప్రియాంక హోటల్‌ని వారు సందర్శిస్తుంటారు. తాజాగా మిసెస్ జోనాస్ ‘సోనా’ రెస్టారెంట్‌కి ఇండియన్ అమెరికన్ టాలెంటెడ్ యాక్టర్ కాల్ పెన్ వచ్చాడు. అక్కడి ఆహార పదార్థల ఫోటో ఒకటి సొషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘ఎట్టకేలకు న్యూయార్క్‌లోని ‘సోనా’కి చేరుకోగలిగాను. ఆహారం ఘుమఘుమలాడుతోంది. వెల్‌డన్ ప్రియాంక!’’ అని క్యాప్షన్ ఇచ్చాడు. గత మార్చి నెలలో... న్యూయార్క్ సిటీలో తనకు ఒక రెస్టారెంట్ ఉన్నట్టు ప్రియాంక వెల్లడించింది. 

Updated Date - 2021-10-11T22:54:31+05:30 IST