వైరల్ అవుతోన్న కాజల్ బేబీ బంప్ ఫోటో

ABN , First Publish Date - 2022-01-24T22:06:56+05:30 IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, ఆమె భర్త గౌతమ్ కిచ్లూ ఇద్దరూ మొదటి సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గౌతమ్ కిచ్లూ కాజల్ గర్భవతి అనే అర్ధం వచ్చేలా ఎమోజీ షేర్ చేసి అభిమానులకు ఆనందం కలగచేశాడు. కాజల్ సైతం తన ప్రెగ్నెన్సీపై ఇటీవల క్లారిటీ ఇచ్చింది. దానికి సమంతా కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రిప్లై ఇచ్చింది. అభిమానులు సైతం కాజల్ దంపతులకు అభినందనలు తెలుపుతూ కామెంట్స్ పెట్టారు.

తాజాగా సోషల్ మీడియాలో షేర్ అయిన కాజల్ బేబీ బంప్ ఫోటో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్ లో కాజల్ అగర్వాల్ కూర్చున్న ఓ ఫోటోలో కాజల్ బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫోటో నుంచి పెద్ద ఎత్తున లైక్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కారణంగా తన సినిమాల్ని పక్కన పెట్టారు. 2022 వ సంవత్సరం తమకు చాలా ప్రత్యేకమైందని తన జీవితంలోకి మూడో వ్యక్తిని ఆహ్వానిస్తున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-24T22:06:56+05:30 IST