Kajal Agarwal: రీ ఎంట్రీకి హైయ్యెస్ట్ రెమ్యునరేషన్..?

Twitter IconWatsapp IconFacebook Icon
Kajal Agarwal: రీ ఎంట్రీకి హైయ్యెస్ట్ రెమ్యునరేషన్..?

కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) మళ్ళీ సినిమాలలో రీ ఎంట్రీకి రెడీ అవుతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం మేరకు ఓ వెబ్ సిరీస్‌కు అమ్మడు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో 'చందమామ'గా తన కంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. దాదాపు 15 ఏళ్ళపాటు తెలుగుతో పాటుగా తమిళ సినిమాలలో నటించి స్టార్ స్టేటస్ అందుకుంది. ఒకదశలో అటు తమిళంలో ఇటు తెలుగులో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్‌గానూ హాట్ టాపిక్ అయింది.

ఇక వ్యాపారవేత్తను పెళ్లి చేస్తున్న ఈ చందమామ ఇటీవల ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన కాజల్ గత ఏడాది ప్రెగ్నెన్సీ వార్తలతో ఒక్కసారిగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లిగా ఇంట్లోనే ఒక కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే, త్వరలోనే మళ్ళీ కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తనకు  ఆఫర్లు కూడా చాలానే వస్తున్నాయట. కానీ, రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా ఇప్పుడు మంచి కథా బలమున్న పాత్రలైతేనే చేయాలనుకుంటుందని టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుందట. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ చేసేందుకు గానూ కాజల్ సైన్ చేసినట్టు సమాచారం. ఇక దీనికి రెమ్యునరేషన్ కూడా భారీగానే ఆఫర్ చేశారట. ఇంతకముందు హాట్ స్టార్‌లో కాజల్ నటించిన హర్రర్ వెబ్ సిరీస్ లైవ్  టెలికాస్ట్ చేసింది. ఇది ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయినా మళ్ళీ వారే కాజల్‌తో ఇప్పుడు మరో వెబ్ సిరీస్ చేయడానికి ముందుకువచ్చారట. మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఆఫర్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకూ నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.