తండ్రీ కొడుకుల అనుబంధంతో ‘కడైసి వివసాయి’

విజయ్‌సేతుపతి, యోగిబాబు నటించిన చిత్రం ‘కడైసి వివసాయి’. ఈ చిత్రం విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. ‘కాక్కాముట్టై’, ‘కుట్రమే దండనై, ‘ఆండవన్‌ కట్టళై’ వంటి చిత్రాలను తెరకెక్కించి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు మణికంఠన్‌. ఈయన తన నాలుగో చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కడైసి వివసాయి’. ఈ చిత్రం షూటింగ్‌ రెండుమూడు సంవత్సరాలకు ముందే పూర్తి చేసుకుంది. అయితే, లాక్‌డౌన్‌కు ముందు రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ, కరోనా రెండో దశ వ్యాప్తి  కారణంగా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని అధికారపూర్వకంగా ప్రకటించారు. ఈనెల 30వ తేదీన ఓటీటీలో విడుదల కానుంది. ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టిన సోనీలైవ్‌లో ఈ చిత్రం ప్రసారం కానుంది. కాగా, ఇందులో 70 యేళ్ళ రైతు ఒకరు నటించారు. విజయ్‌ సేతుపతి, యోగిబాబు లు కీలక పాత్రలను పోషించారు. ఒక అమాయక రైతు (నల్లాండి), ఆయన కొడుకు (విజయ్‌సేతుపతి)ల అనుబంధాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఎం.మణికంఠన్‌ దర్శకత్వం వహించడమేకాకుండా చిత్రాన్ని కూడా నిర్మించారు. అలాగే, ఈ చిత్రానికి గేయరచన చేసిన ఇళయరాజా సంగీత బాణీలను కూడా సమకూర్చారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.