మనసుల్ని కల్మషం చేస్తోంది కరెన్సీ : K. Bhagyaraja

Twitter IconWatsapp IconFacebook Icon
మనసుల్ని కల్మషం చేస్తోంది కరెన్సీ : K. Bhagyaraja

సమాజంలో నకిలీ కరెన్సీ ముద్రించే వారు చాలా తక్కువగా ఉంటారుగానీ, చెలామణిలో ఉండే కరెన్సీ నోట్లు అనేక మంది మనసులను కల్మషం చేస్తున్నాయని దర్శక దిగ్గజం కె.భాగ్యరాజా (K Bhagyaraja) అన్నారు. గణేశ్‌ చంద్రశేఖర్‌ (జీసీ) (Genesh Chandrasekhar) హీరోగా నటించిన చిత్రం ‘సెంజి’ (Senji) చిత్రం ఆడియో, ట్రైలర్‌ రిలీజ్‌ ఇటీవల సినీ ప్రముఖులు కె.భాగ్యరాజా, పేరరసు, కె.రాజన్‌ తదితరుల సమక్షంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగ్యరాజా మాట్లాడుతూ.. ‘నిర్మాత కె.రాజన్‌ ప్రతి వేడుకలోనూ పేద పిల్లల విద్య కోసం తనవంతుగా ఏదో కొంత నగదు దానం చేయడం చాలా సంతోషం. ఈ చిత్రం హీరో జీసీ పెళ్ళి చేసుకుని, పిల్లలకు వివాహాలు చేసి, వారి అనుమతితో సినిమాలోకి రావడం సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశం అతి కొద్దిమందికే దక్కుతుంది. ‘సెంజి’ కోట గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, ఆ కోటలో ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఒక గుర్రం గురించి ఈ చిత్రంలో చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. తమిళ సినిమాలు ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడం ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని కలిగించే అంశం’గా ఉందన్నారు. 


దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. ‘కోలీవుడ్‌లోని తొలి పదిమంది దర్శకుల్లో ఒకరైన కె.భాగ్యరాజా  దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసేందుకు ఎంతగానో ప్రయత్నించాను. సఫలం కాలేదు. కానీ, ఆయనతో కలిసి కూర్చొనే భాగ్యం దేవుడు కల్పించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇందులో నిర్మాత కె.రాజన్‌, దర్శక హీరో, నిర్మాత జీసీ, హీరోయిన్‌ కసన్య (Kasanya) (మాస్కో)తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొని ప్రసంగించారు. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.