బాలచందర్‌ జయంతి వేడుకలకు హాజరు కాబోతోంది వీరే

దక్షిణ భారత సినీచరిత్రలో దర్శక శిఖరంగా పేరు గడించిన కె. బాలచందర్‌ 91వ జయంతి జూలై 9. ఈ సందర్భంగా చెన్నై నగరంలోని తమిళనాడు క్లబ్‌హౌ్‌స్‌లో శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఆయన జయంతి వేడుకలను కె. బాలచందర్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగిన కొందరు కవితాలయా సంస్థ, కె. బాలచందర్‌ కుమార్తె పుష్ప కందస్వామి సంయుక్త సహకారంతో కలిసి నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో కె. బాలచందర్‌తో కలిసి పని చేసిన అనేకమంది సినీ సెలబ్రిటీలు పాల్గొనున్నారు. ఇలాంటి వారిలో రచయిత అజయన్‌ బాలా, దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌, దర్శకనటుడు కె.భాగ్యరాజ్‌, ఫిల్మ్‌మేకర్‌ కేబుల్‌ శంకర్‌, చిత్రా లక్ష్మణన్‌, నటి దీపా వెంకట్‌, దర్శకుడు డీఎఎస్‌ కణ్ణన్‌, నటి దుర్గ, నటి గీత, దర్శకనటుడు, కంపోజర్‌ గిరిధరన్‌, రచయిత ఇసైకవి రమణన్‌, నటుడు జయశ్రీ చంద్రశేఖర్‌, ఫిల్మ్‌మేకర్‌ లక్ష్మీరామకృష్ణన్‌, నటుడు కవితాలయ కృష్ణన్‌, మాధవన్‌, మాళవిక, కేబీ వ్యక్తిగత సహాయకుడు మోహన్‌ కేబీ, నటుడు మోహన్‌రామన్‌, ఫిల్మ్‌మేకర్‌ నాగా, డీవోపీ నట్టి, వీణ వాయిద్య కళాకారుడు రాజేష్‌ వైద్య, నటుడు రమేష్‌ అరవింద్‌, ఎస్వీ శేఖర్‌, సింగర్‌ సీన్‌ రోల్డెన్‌, శ్యామ్‌ రాధాకృష్ణన్‌, నటి శైలజ సెట్లూరు, రచయిత శుభ వెంకట్‌, వాసుకి, విజి చంద్రశేఖర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు. ఈ కార్యక్రమాన్ని దీపా రామానుజం నిర్వహించనున్నారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.